శ‌భాష్ కొర‌టాల‌! మోడీని డైలాగ్ తో క‌డిగేశాడు

శ‌భాష్ కొర‌టాల‌! మోడీని డైలాగ్ తో క‌డిగేశాడు

ఏపీకి అన్యాయం ఎప్పుడో జ‌రిగిపోయింది. విభ‌జ‌న‌తో జ‌రిగిన గాయం ఒక ఎత్తు అయితే.. సాయం చేస్తాన‌ని ప్రామిస్ చేసి.. తూచ్ అన‌టమే కాదు.. బ‌లుపుగా.. వ‌ప‌ర్ పొగ‌రుతో కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ చెప్పిన మాట‌లు ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని.. వారి మ‌న‌సుల్ని తీవ్రంగా గాయ‌ప‌రిచాయి.

జైట్లీ మాట‌లు చూస్తే.. హ‌క్కు లేకున్నా అడుగుతున్న‌ట్లు.. ఛీ.. పొమ్మ‌న్నా.. వెంట‌ప‌డుతూ అడుక్కుంటున్న‌ట్లుగా ఉందే త‌ప్పించి న్యాయంగా.. ధ‌ర్మంగా రావాల్సిన నిధుల గురించి మాత్ర‌మే అడుగుతున్నామ‌న్న విష‌యాన్ని విస్మ‌రించ‌టం క‌నిపిస్తుంది. కోట్లాది మంది ప్ర‌జ‌ల్ని ఇంత చుల‌క‌న‌గా.. అవ‌మాన‌క‌రంగా మాట్లాడిన వేళ‌.. ఏపీ ముఖ్య‌మంత్రి మోడీతో స్నేహానికి స‌గం క‌టీఫ్ చెప్ప‌టం తెలిసిందే.

తాజా ప‌రిణామాల‌పై ఏపీ ప్ర‌జ‌ల‌తో పాటు.. మిగిలిన తెలుగు ప్ర‌జ‌లు సైతం ఆగ్ర‌హంగా ఉన్నారు. విభ‌జ‌న హామీల్ని అమ‌లు విష‌యంలో కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న మొండివైఖ‌రిపై.. తొండి మాట‌ల‌పై ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌న‌దైన స్టైల్లో ఫైర్ అయ్యారు. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామ‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ నేత‌లు మిన‌హా.. మిగిలిన వారు పెద్ద‌గా రియాక్ట్ కావటం లేద‌న్న సామాన్య ప్ర‌జ‌ల వేద‌న‌కు మిన‌హాయింపుగా తాను ఉన్నాన‌నంటూ సోష‌ల్ మీడియాలో త‌న వైఖ‌రిని ట్వీట్ రూపంలో చెప్పేశారు.

ఇటీవ‌ల త‌న సినిమా టీజ‌ర్ లో సీఎం పాత్ర‌లో మ‌హేశ్ చెప్పిన డైలాగ్స్ ను ప్ర‌ధానికి అన్వ‌యిస్తూ త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు గ‌తంలో ఇచ్చిన హామీల‌ను మ‌న‌మంతా క‌లిసి ప్ర‌ధాని మోడీకి గుర్తు చేసి.. ఆయ‌న్ను మ‌నిషిగా మారుద్దాం. తెలుగు రాష్ట్రాలు భార‌త్ లో అంత‌ర్భాగం అని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్‌? అంటూ మోడీని ఉద్దేశించి కొర‌టాల శివ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

అంతేకాదు.. త‌న తాజా మూవీ మిస్ట‌ర్ భ‌ర‌త్ అను నేను టీజ‌ర్ లో బాగా పాపుల‌ర్ అయిన ఓ డైలాగ్‌ను మోడీకి అన్వ‌యిస్తూ సూటిగా ప్ర‌శ్నించారు కూడా.  ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు సినిమా రంగంలో ఇంత సూటిగా.. ఘాటుగా మోడీకి పంచ్ ప‌డేట‌ట్లు వ్యాఖ్య చేసింది కొర‌టాల శివ మాత్ర‌మేన‌ని చెప్పాలి. ఇంత‌కీ ఆయ‌న పెట్టిన పోస్ట్ ఏమిటంటే.. చిన్న‌ప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒక‌సారి ప్రామిస్ చేసి ఆ మాట త‌ప్పితే.. యు ఆర్ నాట్ కాల్డ్ ఏ మ్యాన్ అని. అంటూ చెప్పాల్సిన మాట‌ను.. అనాల్సిన మాట‌ను సింఫుల్ గా సూటిగా అనేశారు. అందుకే శ‌భాష్ కొర‌టాల‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు