‘ముద్ర’ వేయబోతున్న నిఖిల్

‘ముద్ర’ వేయబోతున్న నిఖిల్

యువ కథానాయకుడు నిఖిల్ కొత్త సినిమా ‘కిరాక్ పార్టీ’ ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోపే తన కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు నిఖిల్. ఆ సినిమా తమిళ హిట్ మూవీ ‘కనిదన్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ‘స్పైడర్’ సినిమాను నిర్మించిన పెద్ద నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తమిళంలో ‘కనిదన్’ను రూపొందించిన సంతోషే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ముద్ర’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. కొన్నాళ్లు షూటింగ్ జరిగిన తర్వాత టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను ఒకేసారి లాంచ్ చేస్తారట.

ఠాగూర్ మధు తన బేనర్ మీద ‘ముద్ర’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఆయన ప్రొడక్షన్లో ప్రస్తుతం వేరే సినిమాలేవీ లేవు. ఈ చిత్రంలో నిఖిల్ టీవీ రిపోర్టర్ పాత్ర చేస్తున్నాడు. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం నేపథ్యంలో సాగే సినిమా ఇది. హీరో ఈ కుంభకోణాన్ని ఛేదించి బట్టబయలు చేసే నేపథ్యంలో థ్రిల్లర్ లాగా సాగుతందీ చిత్రం. మరి ఈ చిత్రానికి ‘ముద్ర’ అనే టైటిల్ ఖరారు చేయడంలో ఆంతర్యమేంటో చూడాలి. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడీగా హన్సిక నటిస్తుందని వార్తలొచ్చాయి. అందులో నిజమెంతో మరి? తమిళంలో సీనియర్ కథానాయకుడు మురళి తనయుడు అధర్వ.. కేథరిన్ థ్రెసా జంటగా నటించారు. అంజలా ఝవేరి భర్త తరుణ్ అరోరా విలన్ పాత్ర పోషించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు