పిక్ టాక్: నిజమైన పక్కింటి అమ్మాయిలా

పిక్ టాక్: నిజమైన పక్కింటి అమ్మాయిలా

తెలుగు సినిమాల్లో కొన్నాళ్ల పాటూ త‌మ‌న్నా గాలి బాగానే వీచింది. ప‌వ‌న్ క‌ళ్యాన్... అల్లు అర్జున్‌... రామ్ చ‌ర‌ణ్‌... ఎన్టీఆర్‌... ప్ర‌భాస్‌... ఇలా టాప్ హీరోలంద‌రితోనూ ఆడి పాడింది. కొత్త నీరొచ్చి... పాత‌నీరు కొట్టుకు పోయిన‌ట్టు... కొత్త హీరోయిన్ల రాక‌తో త‌మ‌న్నాకు అవ‌కాశాలు లేకుండా అయిపోయాయి. ప్ర‌స్తుతం తెలుగులో అయితే ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అందుకేనేమో ఇప్పుడు ఆమెలో భ‌క్తి భావం పెరిగిపోయింది. గుడుల చుట్టూ తిరుగుతోంది.

సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న‌న్నాళ్లు... త‌మ‌న్నాకు గుడికెళ్లే ఛాన్స్ కూడా రాలేదు. ఇప్పుడు ఖాళీగా ఉండ‌డంతో స్నేహితుల‌తో క‌లిసి షికార్లు కొడుతోంది. తాజాగా ఆమె త‌న బెస్టీల‌తో క‌లిసి మ‌ధుర‌మీనాక్షి ఆల‌యానికి వెళ్లింది. ఎలాంటి మేకప్ లేకుండా... సాధార‌ణ అమ్మాయిలా క్యాబ్‌లో వెళ్లి వ‌చ్చింది. ఆ ఫోటోల‌ను త‌న ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ ఫోటోలో త‌మ‌న్నా చాలా సింపుల్ గా ఉంది. చుడీదార్ వేసుకుని... ముఖంపై పెద్ద కుంకుమ బొట్టుతో... న‌వ్వుతూ ఫోటోకు ఫోజిచ్చింది. గాళ్‌ నెక్ట్స్ డోర్ పాత్ర అంటూ సినిమాల్లోమాత్రం తెగ గ్లామర్ వలికిస్తుంది తమన్నా. కాని నిజమైన పక్కింటి అమ్మాయి పాత్ర అంటే ఇలా రియల్ లైఫులో వేస్తోంది. బాగుందమ్మా!!

ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగులో క‌ళ్యాణ్ రామ్ తో చేసిన సినిమా కోసం వెయిటింగ్. ఈ సినిమా జయేంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాకు నా నువ్వే అని పేరు పెట్టారు. ఇదొక రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌. మే 25 విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆ తరువాత అమ్మడు క్వీన్ రీమేక్ మరియు సందీప్ కిషన్ సినిమాలతో అలరించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు