రూమర్: బర్తడే నాడు వచ్చిందంటే..

రూమర్: బర్తడే నాడు వచ్చిందంటే..

టాలీవుడ్‌లో ఇప్ప‌టికే ఎన్నో ప్రేమ జంట‌లు సంద‌డి చేస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు కూడా కామ‌న్‌. నాగ్ - అమ‌ల‌... నాగ చైత‌న్య - సమంత‌... మ‌హేష్ బాబు - న‌మ్ర‌తా... సూర్య - జ్యోతిక‌ ఇలా త‌మ కోస్టార్ల‌నే ప్రేమించి పెళ్లాడిన‌ జంట‌లు ఎన్నో. ఇప్పుడు ఇద్ద‌రు యంగ్ హీరో... హీరోయిన్ ప్రేమ‌లో మునిగితేలుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రూ క‌లిసి సూప‌ర్ హిట్ సినిమాలో న‌టించారు. ఆ సినిమా టైంలోనే వారి మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగింది.

సూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించిన యంగ్ బ్యూటీ ఆమె. ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె హ‌వా బాగానే న‌డుస్తోంది. యంగ్ హీరోల ప‌క్క‌న ఛాన్సులు కొట్టేస్తోంది. ఇక అత‌డు త‌క్కువ మాట్లాడుతూ... చ‌క్క‌గా న‌టించే హీరో. వివాదాల‌కు దూరంగా ఉంటాడు. ఇప్ప‌టికే మంచి సినిమాల‌లో న‌టించాడు. వీరిద్ద‌రూ క‌లిసి ఓ కుటుంబ క‌థాచిత్రంలో న‌టించాడు. ఆ సినిమా గ‌త సంక్రాంతికి విడుద‌లై మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. అప్ప‌టి్నించి వీరి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం సాగుతోంద‌ని టాక్ ఉంది. అది నిజ‌మే అని చెప్పేలా మ‌రొక సంఘ‌ట‌న కూడా జ‌రిగింది.

ప్ర‌స్తుతం ఆ యంగ్ హీరో ఓ సినిమా షూటింగ్ కోసం వేరే ఊరిలో ఉంటున్నాడు. ఈ మధ్యన అతని పుట్టిన‌రోజును కూడా అక్క‌డే చేసుకున్నాడు. ఆ వేడుక‌కు... అత‌నితో క‌లిసి ప‌నిచేసిన ఈ యంగ్ బ్యూటీ హ‌ఠాత్తుగా ప్ర‌త్య‌క్ష‌మైంది. అత‌డిని స‌ర్ ప్రైజ్ చేసేందుకు చెప్ప‌కుండా... పుట్టిన‌రోజు నాడు అక్కడకు చేరుకుని.. తెగ హంగామా చేసిందట. దీంతో అక్క‌డ చిత్ర‌యూనిట్ కూడా షాక‌య్యారు. అందుకే వారిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు