శ్రీదేవి సినిమా కాదు.. డాక్యుమెంటరీ

శ్రీదేవి సినిమా కాదు.. డాక్యుమెంటరీ

అతిలోక సుందరి శ్రీదేవి మరణించిన కొన్ని రోజులకే ఆమె బయోపిక్ ముచ్చట్లు తెరమీదికి వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ తన ఆరాధ్య హీరోయిన్ మీద సినిమా తీస్తాడన్న ప్రచారం జరిగింది. కానీ శ్రీదేవి పాత్రలో నటించదగ్గ హీరోయిన్ దొరకడం అసాధ్యమని.. ఆమె మీద సినిమా తీయాలనుకోవడం ఫూలిష్ థింగ్ అని తేల్చేశాడు వర్మ.

ఐతే శ్రీదేవి మీద బాలీవుడ్లో ఎవరో ఒకరు సినిమా చేయకుండా ఉండరనే అనుకున్నారంతా. శ్రీదేవి భర్తే ఈ ప్రయత్నం చేసినా చేయొచ్చని భావించారు. ఐతే తన భార్య జీవితాన్ని జనాలకు చూపించాలని బోనీ అనుకుంటున్నాడు కానీ.. అది సినిమా రూపంలో కాదట. ఆమె జీవితంపై డాక్యుమెంటరీ తీయడానికి బోనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్ సాయంతో శ్రీదేవి డాక్యుమెంటరీని రూపొందించడానికి బోనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. శ్రీదేవికి సంబంధించి తన దగ్గర ఉన్న అన్ని రకాల జ్ఞాపకాల్ని శేఖర్ కపూర్‌‌కు ఇచ్చి ఆమె మీద డాక్యుమెంటరీ తీసి పెట్టమని బోనీ అడిగాడట. శేఖర్ తీసిన ‘మిస్టర్ ఇండియా’లో శ్రీదేవే హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం క్లాసిక్‌గా నిలిచింది.

శేఖర్‌కు కూడా శ్రీదేవితో మంచి సాన్నిహిత్యం ఉంది. శేఖర్ బాలీవుడ్లో సినిమాలు చేసి చాలా ఏళ్లయింది. మళ్లీ శ్రీదేవి డాక్యుమెంటరీతో ఆయన రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీదేవి గురించి జనాలకు తెలియని చాలా విషయాల్ని ఈ డాక్యుమెంటరీలో చూపిస్తారట. ఆమె మరణానికి సంబంధించి కూడా ఇందులో స్పష్టత ఇచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English