నిఖిల్ చాలా పెద్ద స్టేట్మెట్ ఇచ్చేశాడే..

నిఖిల్ చాలా పెద్ద స్టేట్మెట్ ఇచ్చేశాడే..

నటీనటులైనా.. టెక్నీషియన్లయినా.. తాము ఆ సమయానికి చేస్తున్న సినిమా గురించే గొప్పగా చెప్పుకుంటారు. జీవితంలో ఇలాంటి సినిమా చేయలేదని.. ఇలాంటి పాత్ర చేయలేదని.. స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు. ఈ క్రమంలో తాము అంతకుముందు చేసిన మంచి మంచి సినిమాల సంగతి మరిచిపోతుంటారు.

అక్కినేని నాగార్జున అంతటి వాడు.. ‘రగడ’ సినిమా చేస్తూ అది తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అన్నారు. తీరా సినిమా తుస్సుమనిపించింది. తన స్టేట్మెంట్ విషయంలో నాగ్ తర్వాత రిగ్రెట్ అయ్యే ఉంటాడనడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంటే ఇస్తున్న నిఖిల్ తర్వాత ఎలా ఫీలవుతాడో చూడాలి.

తన కొత్త సినిమా ‘కిరాక్ పార్టీ’లో చేసిన క్యారెక్టర్ తన కెరీర్లోనే ది బెస్ట్ అనేశాడు నిఖిల్. ‘‘ఈ సినిమాలో తాను స్టూడెంట్ లీడర్ పాత్ర చేస్తున్నాను. ఇప్పటి వరకు తాను చేసిన అన్ని పాత్రల్లోకి ఇదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పగలను. మొదటి సంవత్సరం ఇంజినీరింగ్‌లో చేరిన ఒక సాదాసీదా కుర్రాడు.. చివరి సంవత్సరానికి వచ్చేసరికి స్టూడెంట్ లీడర్ ఎలా అయ్యాడు అన్నది ఈ కథ. ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్. హ్యాపీడేస్ తర్రవాత నేను చేసిన ఫుల్ లెంగ్త్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇదే. అందుకే ఇది నాకు చాలా స్పెషల్. కెరీర్ పరంగా కూడా ఈ సినిమా నాకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా’’ అని నిఖిల్ చెప్పాడు. మరి ఇదే బెస్ట్ క్యారెక్టర్ అంటున్నాడంటే.. ‘హ్యాపీడేస్’.. ‘స్వామి రారా’.. ‘కార్తికేయ’.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాల్ని మించి నిఖిల్ పాత్ర ఇందులో ఏమంత గొప్పగా, ప్రత్యేకంగా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English