పాపం రాజ్‌ తరుణ్‌ మార్కెట్‌ పడిపోయింది

పాపం రాజ్‌ తరుణ్‌ మార్కెట్‌ పడిపోయింది

ఎలాంటి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా హీరోలైన వారికి ఎన్ని సక్సెస్‌లు వున్నా కానీ ఆ గ్రాఫ్‌ని అలా కాపాడుకుంటూ వుండి తీరాలి. ఒకటి రెండు సినిమాలు అటు ఇటు అయినట్టయితే ఇక ఆ హీరోని పట్టించుకోవడం మానేస్తారు. అసలే యువ హీరోల తాకిడి పెరిగిపోయిన ఇప్పటి ట్రెండ్‌లో ప్రతి సినిమాతోను ఉనికిని చాటుకోవడం అత్యవసరం. ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. అతని సినిమాలకి సరయిన విడుదల తేదీ కూడా దొరకడం లేదు.

సంక్రాంతికి రిలీజ్‌ అయిన రంగుల రాట్నం కనీసం సోదిలో కూడా లేనంత పెద్ద ఫ్లాప్‌ అవడంతో రాజ్‌ తరుణ్‌ మార్కెట్‌కి పెద్ద తగిలింది. ఎప్పట్నుంచో విడుదలకి పెండింగ్‌లో వున్న అతని రాజుగాడు సినిమాని కూడా వాయిదా వేసేసారు. అదే నిర్మాత అనిల్‌ సుంకర తీసిన కిర్రాక్‌ పార్టీని ముందుగా విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌, మేలో భారీ చిత్రాలు చాలానే వున్నాయి కనుక రాజుగాడు రిలీజ్‌ అవడానికి మరి కాస్త సమయం వేచి చూడక తప్పదు. ఈలోగా అతని మరో చిత్రం కూడా రిలీజ్‌కి రెడీ అయింది.

మంచి సీజన్‌ దొరికితే క్యాష్‌ చేసుకునే వీలుంటుంది కానీ ఖాళీ దొరికినపుడు సినిమాలు విడుదల చేస్తే ఫలితం తేడా అవడానికే అవకాశాలెక్కువ. ఏదేమైనా ఈ యువ హీరో కెరియర్‌ కాస్త డేంజర్‌లోనే పడింది. అర్జంటుగా ఒక రెండు హిట్లిస్తే తప్ప మళ్లీ ఊపు వచ్చేట్టు లేదు. కాకపోతే మంచి నిర్మాతల చేతిలో వుండడం అతనికి ప్లస్‌ పాయింట్‌ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English