ఏవండోయ్‌ నానిగారూ.. ఫుల్లుగా పెంచేసారు

ఏవండోయ్‌ నానిగారూ.. ఫుల్లుగా పెంచేసారు

పట్టిందల్లా బంగారం అవుతూ వుండడంతో నాని కోసం నిర్మాతలు భారీగా క్యూలు కట్టేస్తున్నారు. పేరు మోసిన నిర్మాతలకి కూడా నాని ఇప్పుడు డేట్లు ఇవ్వలేకపోతున్నాడు. వచ్చే రెండేళ్ల వరకు అతని డైరీ ఫుల్‌ అయిపోయింది. విపరీతమైన డిమాండ్‌ ఏర్పడడంతో నాని తన పారితోషికం అమాంతం రెండింతలు చేసాడు. ప్రస్తుతం నాని రేటు పది కోట్లు పలుకుతోందని ఇండస్ట్రీ మాట. నానికి పది కోట్లు ఇచ్చి, నిర్మాణానికి మరో పన్నెండు, పదిహేను కోట్ల వ్యయం చేసినా నిర్మాతకి ఈజీగా పది కోట్ల పైనే మిగులుతాయి.

పైగా తన సినిమాలకి భారీగా ఖర్చు పెట్టమని, ఫారిన్‌ లొకేషన్లకి వెళ్లాలని, హంగులు వుండాలని నాని డిమాండ్‌ చేయడు. తన సినిమాల బడ్జెట్‌ విషయంలో నానిది మొదట్నుంచీ మిడిల్‌ క్లాస్‌ మెంటాలిటీనే. స్టార్‌ హీరోలతో వంద కోట్ల వ్యయంతో సినిమాలు తీసి మళ్లీ ఎదురు కట్టాల్సిన పరిస్థితులు తలెత్తుతోన్న సమయంలో నానిలా గ్యారెంటీ లాభాలు తెచ్చిపెట్టే హీరో ఇంకెవరూ కనిపించడం లేదు. దీంతో రెండేళ్లు ఆలస్యమైనా ఫర్వాలేదని, ఇప్పుడే నానికి కోట్లలో అడ్వాన్సులు ఇచ్చి మరీ డేట్లు బ్లాక్‌ చేసుకుంటున్నారు నిర్మాతలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English