`చండీ` నిర్మాతతో శ్రీకాంత్ అడ్డాల?!

 `చండీ` నిర్మాతతో శ్రీకాంత్ అడ్డాల?!

తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి మల్టీ స్టారర్ ట్రెండ్ రావడానికి కారణమైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన తీసిన `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. తీసింది రెండు సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. తాజాగా అడ్డాలతో సినిమా చేయడానికి బడా నిర్మాతలంతా పోటీ పడే పరిస్థితి. అయితే ఇటీవల `చండీ` తీసిన ఒమిక్స్ క్రియేషన్స్ సంస్థలో శ్రీకాంత్ అడ్డాల ఓ సినిమాని చేయబోతున్నారన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

ఆ సంస్థ తమిళంలో విజయవంతమైన `ఆరంభం` సినిమాని `ఆట ఆరంభం` పేరుతో తెలుగులోకి తీసుకొస్తోంది. ఆదివారం హైదరాబాద్ లో `ఆట ఆరంభం` పాటల విడుదల వేడుక జరిగింది. దీనికి శ్రీకాంత్ అద్దాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో ఒమిక్స్ క్రియేషన్స్ సంస్థలో తదుపరి సినిమాని చేయబోతున్న శ్రీకాంత్ అడ్డాల... అంటూ యాంకర్ ఝాన్సీ  గడగడా మాట్లాడేసింది. మరి ఈ విషయం నిర్మాతే చెప్పాడో లేదంటే, ఝాన్సీనే అలా ఫిక్స్ అయిందో తెలియదు కానీ... ఒక్కసారిగా ఖంగుతిన్న శ్రీకాంత్ అడ్డాల ఝాన్సీని నిలువరించే  ప్రయత్నం చేశారు. అతిథిగా వస్తే ఇలా బుక్ చేశారేమిటి అన్నట్టుగా శ్రీకాంత్ కాసేపు స్టేజిపై అదోలా కనిపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు