దర్శకేంద్రుడి కొడుకు గ్లామర్ మీద పడ్డాడు

దర్శకేంద్రుడి కొడుకు గ్లామర్ మీద పడ్డాడు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఇప్పటిదాకా సినీ రంగంలో చేసిన ప్రయత్నాలన్నీ వృథానే. నటుడిగా మారి ‘నీతో’ అనే సినిమా చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘అనగనగా ఓ ధీరుడు’.. ‘సైజ్ జీరో’ సినిమాలు రూపొందించాడు. అవి కూడా దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. దీంతో రెండేళ్ల పాటు ఖాళీగా ఉండిపోయాడు. ఇప్పుడతను మళ్లీ దర్శకుడిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దర్శకుడిగా ప్రకాష్ ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా అతడితో బాలీవుడ్ ప్రముఖ తారలు సినిమా చేయడానికి ముందుకు రావడం విశేషం.

నటులుగా గొప్ప పేరు సంపాదించి జాతీయ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి పురస్కారాలు పొందిన రాజ్ కుమార్ రావు.. కంగనా రనౌత్ ప్రకాష్ దర్శకత్వంలో నటిస్తుండటం విశేషం. వీళ్లిద్దరూ ప్రధాన పాత్రల్లో ‘మెంటల్ హై క్యా’ అనే సినిమా చేస్తున్నాడు ప్రకాష్. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. అందులో కంగనా బికినీలో అందాల విందు చేస్తోంది. ఓవైపు ‘మణికర్ణిక’ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తూ కంగనా ఇలాంటి చిత్రం ఒప్పుకోవడం విశేషమే. ప్రకాష్ కు ఈ సినిమా చేసే అవకాశం అతడి భార్య కనిక ధిల్లాన్ ద్వారానే వచ్చిందని భావిస్తున్నారు. స్క్రీన్ రైటర్ గా ఆమె పలు హిందీ సినిమాలకు పని చేసింది. ఆ పరిచయాలతోనే ప్రకాష్ కు అవకాశం ఇప్పించిందని అంటున్నారు. మరి బాలీవుడ్లో అయినా ప్రకాష్ సక్సెస్ అవుతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు