అయ్యారే! మెగా హీరోతో వర్కవుట్ అయిందా?

అయ్యారే! మెగా హీరోతో వర్కవుట్ అయిందా?

మెగా హీరో ట్యాగ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన వరుణ్ తేజ్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటాడనే మార్క్ ను పొందగలిగాడు. మధ్యలో లోఫర్ వంటి ఫార్ములా సినిమాలు చేసి దెబ్బతిన్న తర్వాత.. రీసెంట్ గా ఫిదా.. తొలిప్రేమ వంటి ఆకట్టుకునే సినిమాలతో బంపర్ హిట్స్ సాధించాడు.

ఇదే స్పీడ్ తో తన తర్వాత సినిమాలను కూడా డిఫరెంట్ జోనర్స్ తో వస్తున్నాడు. గతేడాది ఘాజీ మూవీతో ఆకట్టుకున్న సంకల్ప్ రెడ్డితో ప్రస్తుతం స్పేస్ లో నడిచే సినిమాలో నటించనున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా ఆరంభానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతుండగా.. ఇప్పుడు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. గతంలో అయ్యారే.. అప్పట్లో ఒకడుండే వాడు వంటి చిత్రాలను తెరకెక్కించిన సాగర్ చంద్ర దర్శకత్వంలో.. ఓ మూవీకి యాక్సెప్ట్ చేశాడట వరుణ్ తేజ్. ఈ దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో.. వెంటనే సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

కానీ సాగర్ చంద్ర ప్రస్తుతం వరుణ్ తేజ్ ఇమేజ్ ను మ్యాచ్ చేయగలడా అన్నదే ఆసక్తికరం. ఈ దర్శకుడి గత రెండు చిత్రాలకు మంచి పేరు వచ్చింది తప్ప.. ఒక్కదానికి కూడా డబ్బులు రాలేదు. ఇప్పుడేమో వరుణ్ తేజ్ సినిమా అంటే మినిమం 30 కోట్లు అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఇలాంటి సమయంలో మరి మెగాహీరో సినిమాను సాగర్ చంద్ర ఎలా కమర్షియల్ గా నిలబెడతాడో చూడాలి. పైగా ఇప్పటివరకు సాగర్ చెప్పిన కథలను ఓ ముగ్గురు నలుగురు హీరోలు రిజక్ట్ చేశాక.. మరి ఇక్కడెలా వర్కవుట్ అవుతుందో అనే డౌట్ కూడా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు