అబ్బా.. అది డీల్ అంటావా హెబ్బా!!

అబ్బా.. అది డీల్ అంటావా హెబ్బా!!

కుమారి 21ఎఫ్ తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్.. టాలీవుడ్ లో తెగ జోరు చూపించింది. వరుస సినిమాలు చేయడమే కాదు.. మంచి సక్సెస్ లతో దూసుకుపోయింది కూడా. ఈమెకు ఫిమేల్ డామినేషన్ ఉన్న సినిమా ఆఫర్స్ వరుసగా వచ్చాయంటే.. హెబ్బా ట్యాలెంట్ పై మేకర్స్ కాన్ఫిడెన్స్ అర్ధమవుతుంది.

అయితే.. ఏమయిందో తెలియదు కానీ.. సడెన్ గా ఈ బ్యూటీ సినిమాలు అంగీకరించడం మానేసింది. ఫిజిక్ పై దృష్టి పెట్టిందని.. వర్కవుట్స్ అవీ చేసిసి గ్లామర్ హీరోయిన్ గా మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందనే టాక్ గట్టిగానే వినిపించింది. ఇప్పుడీ ప్రయత్నాలన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లుగా ఉన్నాయి. అందుకే కొత్త సినిమాను యాక్సెప్ట్ చేసేసినట్లుగా కనిపిస్తుంది. 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అనే టైటిల్ పై రూపొందుతున్న మూవీలో నాగ అన్వేష్- హెబ్బా పటేల్ జోడీగా నటించనున్నారు. శ్రీకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదంతా బాగానే ఉంది కాని.. అసలు హెబ్బా సినిమాలను మానేసి.. మళ్ళీ తిరిగి నాగ అన్వేష్‌ తో సినిమా చేసిందంటే.. అతడితో అ.ఆ.ఇ.ఈ ఏదో నడుస్తోందని చాలా కహానీలు వినబడుతున్నాయి. వీటిపై మండిపడిన హెబ్బా.. ఆమె ఈ హీరోతో మరో సినిమా చేస్తానంటూ అప్పట్లోనే డీల్ కుదుర్చుకుందట. అందరూ ప్రొడ్యూసర్లతో డీల్ సెట్ చేసుకుంటే.. హెబ్బా మాత్రం హీరోతో డీల్ చేసుకున్నట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు