ట్రాఫిక్ దెబ్బ‌కు బైక్ ఎక్కిన ఫిదా పోరి!

ట్రాఫిక్ దెబ్బ‌కు బైక్ ఎక్కిన ఫిదా పోరి!

ఒక్క సినిమాతో లైమ్ లైట్ లోకి రావ‌టం అరుదు. కుర్రాకారు మొద‌లు అంద‌రి మ‌న‌సుల్లో పాగా వేయ‌టం అంద‌రికి సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. హీరోయిన్ కు ఉండాల్సిన ల‌క్ష‌ణాల్లో ఏమీ లేకున్నా.. స్టార్ స్టేట‌స్‌ను అందుకున్న సాయి ప‌ల్ల‌వికి అంత క్రేజ్ ఎలా అన్న‌ది చాలామందికి ఉండే సందేహం.

హుషారుగా తిరిగే ప‌క్కింటి అమ్మాయి మాదిరి క‌నిపించే  ఫిదా పోరి ఏం చేసినా న్యూసే. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా ఓపెన్ గా మాట్లాడేయ‌టం.. సాదాసీదాగా వ్య‌వ‌హ‌రించ‌టం ఆమెకు మాత్ర‌మే సాధ్యం. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఆమెకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా కణం మూవీలో యాక్ట్ చేస్తున్న సాయి ప‌ల్ల‌వి.. ఈ చిత్ర‌ప్రీరిలీజ్ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌టానికి హైద‌రాబాద్ వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా ఆమె పెద్ద సాహ‌స‌మే చేశారు. చెన్నై నుంచి హైద‌రాబాద్‌కు రావాల్సిన ఫ్లైట్ ఆల‌స్యం అయ్యింది. ఆమె కార‌ణంగా ప్రోగ్రామ్ డిస్ట్ర‌బ్ కాకూడ‌ద‌న్న‌ది ఆమె ఆలోచ‌న‌. ఎయిర్ పోర్ట్ నుంచి కారులో బ‌య‌లుదేరిన ఆమె ప్రోగ్రాం జ‌రుగుతున్న వెన్యూ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌టానికి ట్రాఫిక్ జాం వ‌ల్ల ఇబ్బందిగా మారింది.

మామూలు హీరోయిన్లు ఎవ‌రైనా స‌రే.. ట్రాఫిక్ జాంను తిట్టుకుంటూ కార్లోనే కూర్చుంటారు. కానీ.. ఈ ఫిదా పోరి అలా ఎందుకు చేస్తుంది. త‌న‌కు ప‌రిచ‌య‌స్తుడైన స్వ‌రూప్ ను బైక్ మీద ర‌మ్మ‌ని చెప్పి..చ‌టుక్కున కారులో నుంచి దిగేసి బైక్ ఎక్కేసింది.

ఫిదా పోరి మాదిరి ఉందే అన్న భావ‌న కొంత‌మందికి అనిపించినా.. ఇలా సాదాసీదా వ్య‌క్తి బైక్ వెనుక కూర్చొని హైద‌రాబాద్ రోడ్ల మీద వెళుతుందా? అన్న క్వ‌శ్చ‌న్ తో కాద‌నుకున్నారు. ప్రోగ్రామ్‌కి మ‌రింత ఆల‌స్యం కాకూడ‌ద‌న్న ఉద్దేశంతో బైక్ మీద కూర్చొని వెళ్లిన  సాయిప‌ల్ల‌వి ప‌లువురిని షాక్ ఇచ్చింది. బైక్ మీద వ‌చ్చారా? అన్న మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా హుషారుగా కార్య‌క్ర‌మానికి వెళ్లిపోయింది. ఫిదా పోరినా మ‌జాకానా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు