‘మరణం’ లేని నిత్య మీనన్

‘మరణం’ లేని నిత్య మీనన్

‘గమ్యం’ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర చనిపోవడం పట్ల ఆమె తల్లి చాలా బాధపడింది అప్పట్లో. అది చూసి తట్టుకోలేకపోయిన ఆమె.. ఇకపై ఎప్పుడూ చనిపోయే పాత్రలు చేయొద్దంటూ కొడుక్కి షరతు పెట్టింది. అల్లరోడు కూడా అమ్మ మాటను జవదాటలేదు.

ఆ తర్వాత ఏ సినిమాలో అతను చనిపోయే పాత్ర చేయలేదు. ఇప్పుడు మలయాళ హీరోయిన్ నిత్యా మీనన్ స్వయంగా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇకపై తాను ఎన్నడూ తెరమీద చనిపోయే పాత్ర చేయనని నిత్య స్పష్టం చేసింది. ఇలాంటి పాత్రలు చేస్తుంటే తనకు చాలా ఇబ్బందిగా ఉందని నిత్య చెప్పింది.

తన పాత్రను చంపేయడం ద్వారా సెంటిమెంటు పండించాలని దర్శకులు చూస్తున్నారని.. ఈ తరహా పాత్రలు పెరిగిపోతున్నాయని.. అందుకే ఇకపై అలాంటి పాత్రలు చేయొద్దని నిర్ణయించుకున్నానని నిత్య చెప్పింది. ‘గంగ’.. ‘మెర్శల్’ లాంటి సినిమాల్లో తన పాత్ర చనిపోతుందని ఆమె చెప్పింది.

ఐతే ‘మెర్శల్’ సినిమా చేస్తున్నపుడు మాత్రం తనకు ఇబ్బందిగా అనిపించిందని.. ఇకపై తాను చనిపోయే పాత్రలు చేయకూడదన్న నిర్ణయానికి అప్పుడే వచ్చానని.. ఈ విషయంలో ఆ చిత్ర దర్శకుడు అట్లీకి కూడా చెప్పానని.. దయచేసి రచయితలు, దర్శకులు ఈ విషయం అర్థం చేసుకుని తనకు అలాంటి పాత్రలు ఆఫర్ చేయొద్దని నిత్యా మీనన్ కోరింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు