సినిమా ఇవ్వకపోయినా త్రివిక్రమ్ కి విషెస్

సినిమా ఇవ్వకపోయినా త్రివిక్రమ్ కి విషెస్

కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. టాలీవుడ్ అరంగేట్రం గురించి మంచి హంగామానే నడిచింది. తెలుగులో తొలి సినిమానే పవన్ కళ్యాణ్ కి చేసి సంచలనానికి కేంద్రం అయ్యాడు అనిరుధ్. అజ్ఞాతవాసి అంటూ వచ్చిన ఈ సినిమా.. రిలీజ్ కి ముందు సంగీతం ద్వారా బాగానే ఆకట్టుకుంది.

కానీ పవన్ రేంజ్ కు తగిన సంగీతం అందించలేకపోయాడనే విమర్శలను అనిరుధ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతే కాదు.. ఆ సినిమా డిజాస్టర్ కావడంలో ఈ కంపోజర్ కు కూడా వాటా ఇచ్చేశారు ఆడియన్స్. ఈ దెబ్బతో తన తర్వాతి సినిమాకు కూడా అనిరుధ్ నే తీసుకోవాలన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆలోచనలకు బలవంతంగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ తో తీయబోతున్న సినిమాకు తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. అయినా సరే.. త్రివిక్రమ్ అండ్ టీం కు బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్ పెట్టాడు అనిరుధ్ రవిచందర్. 'ఇది అద్భుతం. గురూజీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.. తారక్.. తమన్.. హారికా హాసినా బ్యానర్ లు మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా' అన్నది అనిరుధ్ ట్వీట్.

తనకు సినిమా ఇవ్వకుండా తమన్ కు బాధ్యతలు అప్పగించినా.. ఏ మాత్రం ఫీల్ కాకుండా అనిరుధ్ తన మనస్ఫూర్తిగా విషెస్ చెప్పడం.. గమనించాల్సిన విషయం. ఇలా చేయడానికి కారణాలు ఏంటనే విషయాన్ని దర్శక నిర్మాతలు సకారణంగానే వివరించి ఉంటారు. అందుకే ఇలా ట్వీట్ ద్వారా బెస్ట్ విషెస్ చెప్పాడు అనిరుధ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు