సన్నీ కవల పిల్లల తల్లయింది

సన్నీ కవల పిల్లల తల్లయింది

శృంగార తార సన్నీ లియోన్ తల్లి అయింది. ఐతే ఈసారి ఆమె బిడ్డను దత్తత తీసుకోలేదు. తనే తల్లి అయింది. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఐతే మొన్నటిదాకా బయట మామూలుగా తిరుగుతూ కనిపించిన సన్నీ.. ఉన్నట్లుండి తల్లి కావడమేంటన్న సందేహం కలగొచ్చు. ఐతే సన్నీ నేరుగా తనే బిడ్డలకు జన్మనివ్వలేదు. సన్నీ-డేనియల్ వెబర్ సరోగసీ ద్వారా కవలల్ని కన్నట్లు తెలుస్తోంది.

ఈ రోజు ఇద్దరు కవల పిల్లలతో పాటు తాము దత్తత తీసుకున్న అమ్మాయితో కలిసి సన్నీ-వెబర్ ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కవలలకు జన్మనివ్వడంతో వీళ్లిద్దరూ చాలా సంతోషంగా ఉన్న విషయం ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఏడెనిమిదేళ్లుగా ఇండియాలోనే ఉంటూ ఇక్కడే స్థిరపడిన సన్నీ-వెబర్ అనాథ అయిన ఓ అమ్మాయిని గత ఏడాది దత్తత తీసుకుని తనకు నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టుకున్నారు.

ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకుంటూ ఇప్పుడు సొంతంగా పిల్లల్ని కన్నారు. ఒకప్పుడు కేవలం శృంగార తారగానే కనిపించిన సన్నీపై గత కొన్నేళ్లలో జనాల అభిప్రాయం మారిపోయింది. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఒక బిడ్డను కూడా దత్తత తీసుకోవడంతో ఆమెలోని మరో కోణం జనాలకు తెలిసింది. ఇన్నాళ్లూ ఐటెం సాంగ్స్, సెక్సీ క్యారెక్టర్లకే పరిమితం అయిన సన్నీ.. త్వరలోనే ‘వీర మహాదేవి’ అనే భారీ పీరియడ్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు