ఆస్కార్ వేడుకల్లో శ్రీదేవి మాట

ఆస్కార్ వేడుకల్లో శ్రీదేవి మాట

శ్రీదేవి స్థాయి ఏంటో తెలియని వాళ్లకు గత వారం పది రోజుల్లో బాగానే జ్ఞానోదయం అయింది. వారం రోజుల పాటు దేశంలో మరో టాపిక్ లేదసలు. అందరూ శ్రీదేవి గురించే చర్చించుకున్నారు. ఎంతో పెద్ద పెద్ద వాళ్లు కూడా శ్రీదేవిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

దేశం అవతల కూడా చాలామంది ప్రముఖులు శ్రీదేవి గురించి ప్రస్తావించారు. ఇప్పుడు శ్రీదేవి స్థాయి ఏంటన్నది మరోసారి రుజువైంది. మంగళవారం ఆస్కార్ వేడుకల ప్రదానోత్సవంలో కూడా శ్రీదేవి ప్రస్తావన రావడం విశేషం. అవార్డుల వేడుక ఆరంభోత్సవం సందర్భంగా శ్రీదేవికి నివాళి అర్పించడం విశేషం.

అమెరికన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎడ్డీ వెడ్డర్ ఆస్కార్ అవార్డుల వేదిక మీద తన సంగీత ప్రదర్శనతో శ్రీదేవికి నివాళి అర్పించాడు. గత ఏడాది మృతి చెందిన బాలవుడ్ లెజెండరీ యాక్టర్ శశి కపూర్ కు సైతం ఈ వేడుకలో నివాళి ఇచ్చారు. ఇలాంటి గౌరవం అందరికీ దక్కేది కాదు. గత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న నేపథ్యంలో మన సినిమాను.. మన సినీ ప్రముఖుల్ని విస్మరించే పరిస్థితి లేదు.

మరో విశేషం ఏంటంటే.. కన్ను కొట్టే వీడియోతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన ప్రియా ప్రకాష్ వారియర్ ను అనుకరిస్తూ ఆస్కార్ అవార్డుల వేడుకలో కొందరు నటీనటులు ఆమెను అనుకరిస్తూ కన్ను కొట్టే ప్రయత్నం చేయడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు