నిన్న అన్న‌... నేడు అక్క స‌పోర్ట్‌

నిన్న అన్న‌... నేడు అక్క స‌పోర్ట్‌

శ్రీదేవి...బోనీల‌ది రెండో వివాహం. మొద‌టి భార్యను కాద‌ని బోనీ శ్రీదేవిని పెళ్లాడాడు. అప్ప‌ట్లో అది కాస్త వివాదాస్ప‌ద‌మే అయ్యింది. మొద‌టి భార్య పిల్ల‌లు అర్జున్ క‌పూర్‌, అన్షులా క‌పూర్‌. వీరికి శ్రీదేవి అంటే గిట్ట‌ద‌నే ప్ర‌చారం ఉంది. త‌మ త‌ల్లిదండ్రుల‌ను ఆమే విడ‌దీసింద‌నే కోపం వాళ్ల‌ది. ఆ కోపం ప‌బ్లిక్‌లో చాలా సార్లు ప్ర‌ద‌ర్శించాడు అర్జున్ క‌పూర్‌. శ్రీదేవి చ‌నిపోయాక మాత్రం తండ్రికి చెల్లెళ్ల‌కు అండ‌గా నిలిచాడు. ఇప్పుడు అక్క అన్షులా కూడా చెల్లెళ్లు జాన్వీ అండ్ ఖుషీల‌కు స‌పోర్ట్ గా నిలిచింది.

శ్రీదేవిని కోల్పోయాక బోనీ చాలా డిస్ట్ర‌బ్ అయిపోయాడు. అత‌నికి అండ‌గా కొడుకు...కూతుళ్లు ఉన్నారు. ఈ విష‌యాన్ని బోనీ... ట్విట్ట‌ర్‌లోనే చెప్పాడు. అర్జున్ క‌పూర్ శ్రీదేవి చ‌నిపోయిన సంగ‌తి తెలిసి ఒంట‌రిగా ఉన్న జాన్వీకి ఓదార్పునిచ్చాడు. తండ్రి వెంటే ఉన్నాడు. ఇప్పుడు షూటింగ్ కోసం పంజాబ్ వెళ్లిపోయాడు. అత‌ను వెళ్లిపోయాక‌... తండ్రి చెల్లెళ్ల బాధ్య‌త‌ను అన్షులా తీసుకుంది. అర్జున్ అభిమాని ఒక‌రు జాన్వీ... ఖుషీల గురించి ట్విట్ట‌ర్‌లో హేళ‌న‌గా... అస‌భ్యంగా రాశాడు. అది చ‌దివి కోపంతో ఊగిపోయింది ఈ అక్కయ్య. ఆ మెసేజ్‌ను వెంట‌నే డిలీట్ చేసింది. అంతేకాదు...నా చెల్లెళ్ల గురించి అస‌భ్యంగా రాస్తే ఊరుకోన‌ని... వార్నింగ్ ఇచ్చింది. అన్న‌య్య‌కు అభిమాని అయినందుకు సంతోష‌మ‌ని... కానీ ఇలాంటి మెసేజ్‌లు పెట్ట‌ద్ద‌ని కోరింది. అంత‌టా... మంచిని ప్రేమ‌ని పెంపొందించేలా ప్ర‌వ‌ర్తించ‌మ‌ని హిత‌వు ప‌లికింది. మొత్త‌మ్మీద అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో చెల్లెళ్ల‌కు అండ‌గా నిలిచి అంద‌ని మ‌న్న‌న‌లు పొందింది అన్షులా.

శ్రీదేవి గ‌త నెల 24న దుబాయ్‌లో హోటల్‌లోని బాత్ టబ్ లో ప‌డిపోయి మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు మూడు రోజుల త‌రువాత ఆమె భౌతిక దేహాన్ని ప్ర‌త్యేక విమానంలో ఇండియా తీసుకొచ్చారు. అధికార లాంఛ‌నాల‌తో ముంబైలోనే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఆమె అస్థిక‌ల‌ను రామేశ్వ‌రంలో స‌ముద్రంలో క‌లిపేశారు కపూర్ ఫ్యామిలీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English