నాగ్ తో పోటీకి నందమూరి సై!!

నాగ్ తో పోటీకి నందమూరి సై!!

సినిమాల మధ్య పోటీ సహజమే కానీ.. టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలకు చెందిన హీరోలు పోటీ పడుతుంటే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోతున్నాయి. ఎమ్మెల్యే చిత్రాన్ని ఏ సమయంలో అయినా రిలీజ్ చేసేందుకు వీలుగా రెడీ చేసేశాడు ఈ హీరో.

మరోవైపు కళ్యాణ్ రామ్ నటించిన నా నువ్వే చిత్రం కూడా విడుదలకు దగ్గర అవుతోంది. ఈ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసే స్థితికి వచ్చేగా.. మే 25న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తమన్నా హీరోయిన్ గా నటించిన నా నువ్వే టీజర్ విడుదల నుంచి విపరీతంగా ఆకట్టుకుంది. 180 ఫేమ్ జయేంద్రన్ రూపొందించిన ఈ సినిమా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే.. కళ్యాణ్ రామ్ నటించిన నా నువ్వే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన డేట్ కి.. తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ముందే అక్కినేని నాగార్జున చెప్పేశారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఆఫీసర్.. మే నెల 25న విడుదల కానుంది.

అంటే.. అదే రోజున అటు అక్కినేని సీనియర్ తో.. ఇటు నందమూరి యంగ్ హీరో కూడా బరిలోకి దిగుతాడన్న మాట. అయితే.. నాగ్ నటించిన మూవీ పూర్తి సీరియస్ జోనర్ కా.. కళ్యాణ్ రామ్ మూవీ కంప్లీట్ గా లవ్ స్టోరీ. సో.. ఈ రెండు ఒకే సమయంలో వస్తున్నా.. పోటీ అనే పాయింట్ పెద్దగా కనిపించకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు