రకుల్‌‌ను కరుణించారండోయ్..

రకుల్‌‌ను కరుణించారండోయ్..

గత ఏడాది వరకు టాలీవుడ్లో రకుల్ ఉన్నంత ఊపులో మరే హీరోయిన్ లేదు. చాలా త్వరగా స్టార్ ఇమేజ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఉన్న స్టార్లు ఒక్కొక్కరినీ రౌండప్ చేస్తూ వెళ్లింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో కూడా నటించింది. కానీ ఏం లాభం మహేష్ తో చేసిన ‘స్పైడర్’ దారుణమైన డిజాస్టర్ కావడంతో ఆమె జాతకం తిరగబడింది. అప్పట్నుంచి రకుల్ కు తెలుగులో మరో సినిమా లేదు. తమిళం నుంచి కూడా అవకాశాలు రాలేదు. ఈ మధ్య ఒకట్రెండు సినిమాలకు రకుల్‌ను తీసుకుని మళ్లీ ఆమెను తప్పించి వేరే హీరోయిన్లను రీప్లేస్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. ఇలాంటి సమయంలోనే హిందీలో రకుల్ నటించిన ‘అయ్యారీ’ డిజాస్టర్ అయింది. దీంతో రకుల్ భవితవ్యం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఐతే రకుల్‌కు ఎట్టకేలకు చాన్నాళ్ల తర్వాత ఒక అవకాశం వచ్చింది. అది ద్విభాషా చిత్రం కావడం విశేషం.

తమిళ కథానాయకుడు కార్తి కొత్త సినిమాలో రకుల్ కథానాయికగా నటించనుంది. వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘ఖాకి’ విజయవంతం కావడంతో మరోసారి కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారు. రజత్ అనే కొత్త దర్శకుడు రూపొందించబోయే థ్రిల్లర్ మూవీ ఇది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, కార్తీక్ లాంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటించనుండగా.. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హ్యారిస్ జైరాజ్ సంగీత దర్శకుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు