ఇంతలో అంతెలా తగ్గాడో

ఇంతలో అంతెలా తగ్గాడో

టాలీవుడ్ లో ఆయనో స్టార్ హీరో. వారసత్వంతో సినిమాల్లోకి వచ్చినా.. సొంత ట్యాలెంట్ తో అభిమాన గణాన్ని పెంచుకున్నాడు. ఫ్యామిలీ కంటే ఈయనకు ఆడియన్స్ నుంచి వచ్చిన సపోర్ట్ ఎక్కువ అంటే తప్పేమీ లేదు. అన్ని రసాలను అద్భుతంగా పలికించగలిగే ఈ హీరోకు.. భారీ విగ్రహం అన్నది ఒక్కటే లోటు. అయితే.. అప్పుడప్పుడు తన సినిమాల్లో తెగ చిక్కిపోయి కనిపిస్తుంటాడు ఈ స్టార్ హీరో.

మరుసటి సినిమాకే మళ్లీ లావయిపోతుంటాడు. వరుసగా హిట్స్ కొడుతున్న ఈ స్టార్ హీరో.. ఇప్పుడు తొలిసారిగా ఓ కాంబినేషన్ లో చిత్రాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందుకోసం తన ఫిజిక్ ను కూడా తెగ తగ్గించేసుకున్నాడు. కానీ కొన్ని వారాల క్రితం వరకూ మామూలుగానే కనిపించిన ఈ హీరో.. ఇప్పుడు మరీ బక్కచిక్కిపోయినట్లుగా.. ఏకంగా ఓ 15-20 కేజీల బరువు తగ్గిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఎంత పాపులర్ న్యూట్రిషనిస్ట్ ని.. ఫిట్నెస్ ని ట్రైనర్ ను ఏర్పాటు చేసుకున్నా.. మరీ ఇంత షార్ట్ టైంలో.. అంత షార్ప్ గా వెయిట్ లాస్ కావడం ఆశ్చర్యమే.

ఇలా తగ్గిపోవడం వెనుక అంతా వర్కవుట్స్ మాత్రమే కారణం కాదని.. లైపోసక్షన్ చేయించుకుని మరీ వెయిట్ తగ్గి ఉండవచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సహజంగా ఇలాంటి వాటికి ఈయన వ్యతిరేకమే కానీ.. ఇప్పుడు చేయబోతున్న సినిమాకు మాత్రం సన్నగా ఉండడం చాలా అవసరం కావడంతో.. అర్జంటుగా ఇలా లైపో చేయించుకుని మరీ తగ్గిపోయాడనే టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English