మ‌రో మూడు రోజుల్లో చెర్రీ కొత్త లుక్‌?

మ‌రో మూడు రోజుల్లో చెర్రీ కొత్త లుక్‌?

రంగ‌స్థ‌లం సినిమా కోసం ఎన్నో నెల‌లుగా గెడ్డాన్ని పెంచుతూనే ఉన్నాడు చ‌ర‌ణ్‌. ఆ సినిమా షూటింగ్ కాస్త పూర్త‌యింది. అయినా ఇంకా చెర్రీ గెడ్డం తీయ‌కుండా అలానే ఉంచాడు. మ‌రో మూడు రోజుల్లో మాత్రం తీయ‌క త‌ప్ప‌దు. త్వ‌ర‌లో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది... క‌నుక చెర్రీ న్యూలుక్ కు మ‌రో మూడు రోజులే గ‌డువు.

రంగ‌స్థ‌లంలో చెర్రీది డీగ్లామ‌ర్ పాత్ర‌. ప‌క్కా ప‌ల్లెటూరి పిల్ల‌గాడు. అది కూడా 1980ల‌నాటి క‌థ‌. అప్ప‌టికి త‌గ్గ‌ట్టు క‌నిపించాలంటే... గెడ్డాలు... మీసాలు కామ‌న్‌. సినిమా మొత్తం ఆ లుక్‌లోనే క‌నిపించాలి క‌నుక‌... నెల‌ల త‌ర‌బ‌డి గెడ్డాల్ని ట్రిమ్ చేయ‌కుండానే ఉన్నాడు చెర్రీ. అతి త్వ‌ర‌లో త‌న త‌ర‌వాతి సినిమా షూటింగ్ పాల్గొనాల్సి ఉంది. బోయ‌పాటి శ్రీనుతో చేయ‌బోయే ఆ సినిమా యాక్ష‌న్ మూవీ అని తెలుస్తోంది. ఆ సినిమాలో న్యూలుక్‌తో... హ్యాండ్స‌మ్ గా క‌నిపించాల‌న్న‌ది బోయ‌పాటి ప్లాన్‌. అందుకు త‌గ్గ‌ట్టు ఇప్పుడు చెర్రీ గెడ్డాలు... మీసాలు తీసేయాలి. మ‌రో మూడు రోజుల్లో కొత్త‌సినిమా లుక్ తో చెర్రీ సిద్ధ‌మైపోతున్నాడ‌ని స‌మాచారం.

బోయ‌పాటి తీయ‌బోయే సినిమా షూటింగ్ మార్చి6 నుంచి ప్రారంభం కానుంది. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో యాక్ష‌న్ సీన్స్ మొద‌ట తీయ‌బోతున్నారు. వేలాది మంది మ‌ధ్య ఈ సీన్ షూట్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ షూటింగ్‌లో రామ్ చ‌ర‌ణ్ తో పాటూ వివేక్ ఓబెరాయ్‌... మ‌హేష్ మంజ్రేక‌ర్ కూడా పాల్గొన‌బోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు