ఆ స్టారు.. చిన్నోడేమీ కాదు సారూ

ఆ స్టారు.. చిన్నోడేమీ కాదు సారూ

సినిమా స్టార్లు అంటే ఎక్కువ రేంజ్.. టీవీ స్టార్లు అంటే తక్కువ రేంజ్ అనుకుంటారంతా. క్రేజ్ విషయంలో కానీ.. రేంజ్ విషయంలో కానీ.. సంపాదన విషయంలో కానీ.. సినిమా తారలకు తామేమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్న టీవీ తారలు కూడా ఉంటున్నారు. కామెడీ స్టార్ కపిల్ శర్మ గురించి.. మన జనాలకు ఇంట్రడక్షన్ అక్కరలేదు.

అంతగా అందరికీ దగ్గరైన ఈయన.. కామెడీతోనే ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ కు ఎదిగేశాడు. రీసెంట్ గా కపిల్ శర్మ తన వ్యానిటీ వ్యాన్ ఫోటోలను షేర్ చేశాడు. ఓ టీవీ స్టార్ కు ఇలాంటి అద్భుతమైన వ్యాన్ అని అంతా ముక్కున వేలేసుకున్నారు. అయితే మీడియా జనాలు కూడా టీవీ స్టార్ అనేసి కపిల్ ను చిన్నోడిగా చిత్రీకరిస్తున్నారు. నిజానికి కపిల్ శర్మ జస్ట్ టీవీ స్టార్ మాత్రమే అనేందుకు లేదు. ఇతని రెమ్యూనరేషన్ తెలిస్తే ఔరా అనుకోవాల్సిందే. ఒక్కో ఎపిసోడ్ కు కనీసం 60 లక్షల పారితోషికం తీసుకునే కపిల్ శర్మ ఆదాయం.. సంవత్సరానికి 60 కోట్లకు పైగా ఉంటుంది.

రెండేళ్ల క్రితమే 15 కోట్ల రూపాయలను ఇన్ కం ట్యాక్స్ కట్టాడంటే కపిల్ శర్మ రేంజ్ అర్ధమవుతుంది. ఇంతటి రెవెన్యూ అంటే.. మన అల్లు అర్జున్ అండ్ మహేష్‌ బాబు రేంజ్ ఇన్ కం అని గుర్తుంచుకోవాలి. ఫోర్బ్స్ సెలబ్రిటీ లిస్ట్ టాప్ 100లో కపిల్ శర్మ ర్యాంకు 36. మరి ఇంతగా సంపాదించేసేవాడిని.. జస్ట్ టీవీ స్టార్ అనడం కరెక్ట్ కాదు కదా.. ఇలాంటోడు ఓ కోటి ఖర్చు పెట్టి వ్యాన్ తయారు చేసుకోవడం పెద్ద విషయమేమీ కాదు కదా..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు