హ‌లో బ్యూటీ... పెళ్లి చేసుకోవ‌ట్లేదు

హ‌లో బ్యూటీ... పెళ్లి చేసుకోవ‌ట్లేదు

హ‌లో సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యమై యువ‌న‌టి క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. మ‌ల‌యాళం న‌టి లిజీ అండ్ ప్రొడ్యూస‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్‌ల ముద్దుల కూతురు. తెలుగు సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఇంకా సినిమా కెరీర్ మొద‌లుపెట్ట‌క‌ముందే ఆమె ఎఫైర్‌ల‌పై వార్త‌లు గుప్పుమ‌న్నాయి... ఇక హీరోయిన్ అయ్యాక‌ ఆ గుస‌గుస‌లు త‌గ్గుతాయి కానీ... పెర‌గ‌వు క‌దా.

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కొడుకు ప్ర‌ణ‌వ్ మోహ‌న‌లాల్‌. క‌ళ్యాణికీ... ప్ర‌ణ‌వ్‌కు ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి... ఎన్నో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వారిద్ద‌రూ పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌ని... త్వ‌ర‌లో పెళ్ళి చేసుకుంటార‌ని... వార్త‌లు వ‌చ్చాయి. వాటిపై ఓ క్లారిటీ ఇచ్చింది హ‌లో బ్యూటీ. ఓ ఇంట‌ర్య్వూలో ఆ పుకార్లు ఎక్క‌డ నుంచి పుడ‌తాయో తెలియ‌డం లేదంటూ కామెంట్ చేసింది క‌ళ్యాణి. ప్ర‌ణ‌వ్ చెల్లి త‌న‌కు ఓ క్లిప్పింగ్ వాట్సాప్ చేసింద‌ని... అందులో ప్ర‌ణవ్ ... తానూ పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు రాసి ఉంద‌ని తెలిపింది. వెంట‌నే త‌ల్లిదండ్రుల‌కు ఆ క్లిప్పింగ్ పంపాన‌ని... త‌న త‌ల్లి ప్ర‌ణవ్ అమ్మ అయిన సుచిత్ర‌కు వాట్సాప్ చేసింద‌ని చెప్పింది. ఆ క్లిప్పింగ్ చూసి ఇద్ద‌రూ తెగ న‌వ్వుకున్నార‌ని చెప్పింది. త‌మ మ‌ధ్య అలాంటి బంధ‌మేమీ లేద‌ని క్లారిటీ ఇచ్చింది.

ప్ర‌ణవ్ గురించి త‌న‌కు బాగా తెలుసున‌ని...అత‌ను చాలా త‌క్కువ‌గా మాట్లాడ‌తాడ‌ని... ఒక స్టార్ హీరో కొడుకున‌న్న ఫీలింగ్ అత‌నిలో ఉండ‌ద‌ని చెప్పుకొచ్చింది. కొండ‌లు.. గుట్ట‌లు ఎక్క‌డమంటే ప్ర‌ణ‌వ్ కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పింది. జేబులో డ‌బ్బుల్లేకుండానే బ‌య‌టికి వెళ్లిపోతాడ‌ని, ఒక్కోసారి కేవ‌లం అయిదువంద‌ట రూపాయ‌ల‌తో దూర ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు వెళతాడని, లారీల్లో కూడా ప్ర‌యాణించి వెళ‌తాడ‌ని చెప్పింది. ప్ర‌ణ‌వ్ కు సినిమాల‌లో ప‌నిచేయాల‌న్నా క‌ల‌లేవీ లేవ‌ని... పెద్ద తోట‌లో చెట్లు... ర‌క‌ర‌కాల ప‌క్షులు... జీవుల‌ను పెంచాల‌న్న డ్రీమ్ మాత్రం ఉందని చెప్పింది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు