రేటు అంత పెంచేశావా నానీ!!

రేటు అంత పెంచేశావా నానీ!!

నాని ఇప్పుడు బాగా బిజీ. వరుసగా సినిమాలు చేయడమే కాదు.. చేసిన అన్ని సినిమాలతోను సక్సెస్ లు సాధిస్తున్నాడు. నాని మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో.. యావరేజ్ కంటెంట్ సినిమాలు కూడా మంచి సక్సెస్ లు సాధిస్తున్నాయి. న్యాచురల్ స్టార్ లేటెస్ట్ మూవీ ఎంసీఏ.. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగలిగింది.

గతంలో 10 కోట్లను ఏడాదికి సంపాదించడం నాని టార్గెట్. అయితే.. రెమ్యూనరేషన్ పెంచకుండా.. మూడు-నాలుగు సినిమాలు చొప్పున చేసి.. తన లక్ష్యాన్ని అందుకునే వాడు. అందుకే నానితో సినిమా అంటే మినిమం గ్యారంటీ హిట్ అయిపోయేది. ఇప్పుడు ఈ యంగ్ హీరో రేంజ్ పెరిగింది. అందుకు తగ్గట్లుగానే పారితోషికం కూడా పెంచేశాడట. ఇప్పటివరకూ ఉన్న కమిట్మెంట్స్ ను వదిలేసి.. మిగిలిన వాటికి మాత్రం ఏకంగా 9 కోట్ల పారితోషికం అడుగుతున్నాడట. నాని సినిమా అంటే కనీసం 25-30 కోట్ల షేర్ గ్యారంటీ అనే రేంజ్ లో సినిమాలు ఆడుతుండడంతో.. ఈ ఫిగర్ కు పెద్దగా అభ్యంతరాలు రావడం లేదని అంటున్నారు.

ఒక సినిమా రిలీజ్ డేట్ నాటికే మరో సినిమాను దాదాపుగా ఫినిష్ చేసేసే వరకూ వచ్చేస్తాడు నాని. ఈ ఏడాది కూడా 3 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సినిమాకు 9 కోట్ల చొప్పున.. ఎలా చూసుకున్నా మినిమం ఏడాదికి 25 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా అందుకునే అవకాశాలున్నాయి. బహుశా తన టార్గెట్ ను 10 నుంచి 25 కోట్లకు పెంచుకుని ఉంటాడని.. అందుకే ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచాడని అంటున్నారు సినీ జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English