సునీల్ చేతికి అప్పుడే ఐదొచ్చాయ్

సునీల్ చేతికి అప్పుడే ఐదొచ్చాయ్

కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్.. ఇప్పుడు మళ్లీ కామెడీ వేషాల వైపు టర్న్ అయిన సంగతి తెలిసిందే. సునీల్ హీరోగా మారిన మొదట్లో మంచి విజయాలే దక్కినా.. రాన్రానూ విజయం అందుకోవడం దుర్లభం అయిపోయింది. ఇప్పుడు అవకాశాలు కూడా అడుగంటిపోయాయి. అందుకే కమెడియన్ గా కంటిన్యూ కావాలని ఫిక్స్ అయిన సునీల్.. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటున్నాడు.. అలాగే తనే అడిగి మరీ ఛాన్సులు అందుకుంటున్నాడు.

వెంకటేష్ హీరోగా రూపొందే చిత్రంలో ఓ క్యారెక్టర్ చేస్తున్న సునీల్.. చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిలో కూడా ఓ చిన్న రోల్ ను పోషించబోతున్నాడు. అలాగే శ్రీనువైట్ల- రవితేజ కాంబినేషన్ లో రూపొందే మూవీలో కూడా ఓ మంచి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇవి కాకుండా మరో రెండు సినిమాలకు కూడా సునీల్ సైన్ చేశాడని.. కమెడియన్ గా స్పీడ్ చూపించడానికి ఫిక్స్ అయ్యాడని అంటున్నారు.

కమెడియన్ క్యారెక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్న సునీల్.. హీరో పాత్రలపై మాత్రం అంతగా ఫోకస్ చేయడం లేదని తెలుస్తోంది. గతంలో మాదిరిగా అవే చేస్తానని గిరి గీసుకుని కూర్చోకుండా.. మధ్యమధ్యలో అవకాశాలు వస్తే.. అపుడు హీరో పాత్రల్లో కూడా నటించాలని భావిస్తున్నాడట. ఒకవైపు కమెడియన్ గాను.. మరోవైపు హీరోగాను నటిస్తూ కెరీర్ కంటిన్యూ చేయనున్నాడట సునీల్. మళ్లీ స్టార్ కమెడియన్ స్టేటస్ సునీల్ కు అందుతుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు