త్రివిక్రమ్‌ని పడగొట్టాడు

త్రివిక్రమ్‌ని పడగొట్టాడు

హీరో అయిన తొలి నాళ్లలో పేరున్న యువ దర్శకులు నితిన్‌తో సినిమాలు చేయడానికి ఉత్సాసపడేవారు. తేజ, వినాయక్‌, రాజమౌళిలాంటి దర్శకులతో పని చేసిన నితిన్‌ ఆ టైమ్‌లో చాలా వేగంగా పాపులర్‌ అయ్యాడు. అయితే ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు.

తనకేది సూట్‌ అవుతుందనేది తెలుసుకోవడంలో పూర్తిగా ఫెయిలయ్యాడు. ఫలితంగా పధ్నాలుగు వరుస ఫ్లాపులు చవిచూసి హీరోగా తెర పడిపోయినట్టే అనుకుంటున్న దశలో ఇష్క్‌, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలతో తిరిగి నిలదొక్కుకున్నాడు. తనకి ఏది బెస్ట్‌ అనేది ఇప్పుడు నితిన్‌కి బాగా తెలుసు. 'గుండె జారి గల్లంతయ్యిందే' చూసిన తర్వాత పలువురు స్టార్‌ డైరెక్టర్లు నితిన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు.

సుకుమార్‌ డైరెక్షన్‌లో, పూరి దర్శకత్వంలో నితిన్‌ సినిమాలుంటాయని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం చూసిన త్రివిక్రమ్‌ కూడా నితిన్‌ని బాగా మెచ్చుకున్నాడట. ఇష్క్‌ చిత్రానికి నిత్యామీనన్‌ ప్లస్‌ అయినా కానీ ఈ చిత్రానికి అన్నీ నువ్వే అయ్యావని త్రివిక్రమ్‌ ప్రశంసించాడట. ఏమో అదృష్టం బాగుంటే టాప్‌ హీరోలతో మాత్రమే సినిమాలు తీస్తున్న త్రివిక్రమ్‌తో నితిన్‌కి కూడా ఓ చిత్రం సెట్‌ అవుతుందేమో ఎవరికి తెలుసు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English