నా ఇష్టం.. బరువు పెరుగుతా

నా ఇష్టం.. బరువు పెరుగుతా

నిత్య మీనన్ లాంటి అమ్మాయి హీరోయిన్ కావడం ఆశ్చర్యకరమైన విషయం. అంత తక్కువ ఎత్తుతో ఉన్న హీరోయిన్లు చాలా అరుదుగా కనిపిస్తారు. ఐతే తన యాక్టింగ్ టాలెంట్‌తో ఆ బలహీనతను కప్పి పుచ్చేసి మంచి మంచి అవకాశాలు తెచ్చుకుంది నిత్య.

ఐతే ఈ మధ్య అమ్మడు బాగా బరువు పెరిగిపోయి చూడటానికి ఎబ్బెట్టుగా తయారైంది. ‘అ!’ సినిమా ప్రమోషన్ల కోసం వచ్చిన నిత్యను చూసి అందరూ షాకైపోయారు. బరువు పెరగడమంటే కూడా మామూలుగా కాదు. పూర్తిగా షేప్ ఔట్ అయిపోయి కనిపించిందామె. కథానాయికగా కొనసాగుతూ ఇలా తయారవడమేంటి అని అనుకున్నారంతా.

ఐతే ఈ విషయమై నిత్యను ప్రశ్నిస్తే ఆమెకు కోపం వచ్చేసింది. నా బాడీ నా ఇష్టం.. ఎంతైనా బరువు పెరుగుతా.. మీకెందుకు అంటూ మీడియా వాళ్లను ఎదురు ప్రశ్నించింది. తాను పెద్దగా సినిమాలు చేయలేదని.. తనను ఎగ్జైట్ చేసే పాత్రలు రాకపోవడంతో బ్రేక్ తీసుకున్నానని.. అందుకే బాడీ గురించి కూడా పట్టించుకోలేదని.. అలా బరువు పెరిగానని నిత్య చెప్పింది. ఈ స్పేస్‌ను తాను ఆస్వాదించానని ఆమె అంది.

ఐతే బరువు తగ్గడం తనకు పెద్ద సమస్యేమీ కాదని.. కొన్ని రోజుల్లోనే మార్పు చూపిస్తానని చెప్పింది. ఐతే నిత్య ఒక పాత్ర కోసమే బరువు పెరిగిందని.. ఐతే ఆ సినిమా ముందుకు కదల్లేదని.. దీంతో మళ్లీ పూర్వపు స్థితికి చేరడానికి ఇప్పటికే వర్కౌట్లు మొదలుపెట్టిందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు