తెలుగు పిల్ల బంపరాఫర్ పట్టేసింది

తెలుగు పిల్ల బంపరాఫర్ పట్టేసింది

సినిమాల్లో అవకాశాల కోసం ఇంతకుముందు లాగా ప్రొఫైల్స్ పట్టుకుని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల ఆఫీసుల చుట్టూనే తిరగక్కర్లేదు. తమ టాలెంట్ ఏంటో చూపిస్తూ ఒక షార్ట్ ఫిలిం చేసి దాన్ని వైరల్ చేయగలిగినా చాలు.. సినిమా జనాలకు అది రీచ్ అయిపోతుంది. అలా ఈ మధ్య కాలంలో చాలామంది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు.

అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్ కూడా అలాగే జనాల దృష్టిని ఆకర్షించింది. ఈ అమ్మాయి షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే పేరు సంపాదించింది. విజయ్ దేవరకొండ  లేటెస్ట్ మూవీ ‘ట్యాక్సీవాలా’లో కథానాయికగా ఎంపికైంది.

షార్ట్ ఫిలిమ్స్‌తోనే పేరు సంపాదించిన రాహుల్ సాంకృత్యన్.. ప్రియాంకకు ‘ట్యాక్సీవాలా’లో అవకాశం కల్పించాడు. ఈ అమ్మాయికి ఇప్పుడు మరో బంపరాఫర్ తగిలినట్లు సమాచారం. శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన ప్రియాంక నటించబోతోందట. ప్రియాంక షార్ట్ ఫిలిమ్స్ చూసి.. ‘ట్యాక్సీవాలా’లో ఆమె యాక్టింగ్ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకుని పునీత్ సినిమాకు తీసుకున్నారట. ఇంతకుముందు మంచు మనోజ్‌తో ‘పోటుగాడు’ తీసిన కన్నడ స్టార్ డైరెక్టర్ పవన్ వడెయార్ పునీత్-ప్రియాంక చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.

ఇదొక థ్రిల్లర్ మూవీ అని సమాచారం. కన్నడలో తొలి సినిమానే పునీత్‌తో చేయడమంటే చిన్న విషయం కాదు. ఈ సినిమా హిట్టయితే ప్రియాంక అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English