లెన్స్ తో ఆటలాడుతున్న అనుపమ

లెన్స్ తో ఆటలాడుతున్న అనుపమ

మన సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఇప్పుడిప్పుడే మెల్లగా ట్రెండ్ మారుతోంది. పాటల కోసమే కాకుండా.. హీరోయిన్ కోసం కూడా క్యారెక్టర్లు.. కథలు రాయడం జరుగుతోంది. అయితే.. ఎలాంటి పాత్రను మెప్పించేయగలిగే భామలు కొందరే ఉంటారు. వీరిలో అనుపమా పరమేశ్వరన్ ను కూడా తప్పకుండా చెప్పుకోవాలి.

పక్కింటి అమ్మాయి పాత్ర నుంచి ఎన్ఆర్ఐ భామ వరకూ క్యారెక్టర్లను చేసి మెప్పించింది అనుపమ. ఇప్పుడీమె మరో తరహా పాత్రలో నటించేస్తోంది. ప్రొఫెషన్ ప్రకారం క్యారెక్టర్ డిజైనింగ్ హీరోయిన్లకు అరుదుగా జరుగుతుంది. ఇలాంటి ఛాన్స్ ఈ మలయాళీ ముద్దుగుమ్మకు వచ్చింది. నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో అనుపమ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఈమె ఫోటోగ్రాఫర్ గా కనిపించనుంది. ఆమె బాడీ లాంగ్వేజ్.. ఎక్స్ ప్రెషన్స్.. కొత్తగా ఉంటాయని.. ఆ ప్రొఫెషన్ కి తగినట్లుగా డిజైన్ చేసిన తీరు.. వాటిని ఆమె ప్రదర్శించిన తీరు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు.

లెన్స్ పర్సన్ పాత్రను అనుపమా పరమేశ్వరన్ మెప్పించిన తీరు చాలా బాగుంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. నాని డ్యుయల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో.. రుష్కర్ మీర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను.. ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English