ఆ మెట్టు కూడా ఎక్కేసిన అమల

ఆ మెట్టు కూడా ఎక్కేసిన అమల

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎవరికి అయినా పలు లక్ష్యాలు ఉంటాయి. కానీ ఎవరికి అయినా సరే ఫైనల్ టార్గెట్ మాత్రం బాలీవుడ్ హీరోయిన్ అనే ట్యాగ్ లైనే. అందరికీ ఈ అవకాశం రాదు.. వచ్చిన వాళ్లు అందరూ సక్సెస్ కాలేరు. ఇప్పుడు దక్షిణాది హీరోయిన్ అమలా పాల్ కు కూడా బాలీవుడ్ హీరోయిన్ అయే ఛాన్స్ వచ్చింది.

అలాగని ఇదేమీ అదృష్టం కొద్దీ వచ్చేసిన అవకాశం కాదు. ట్యాలెంటెడ్ బ్యూటీ అయి ఉండి.. ఎన్నో అవార్డులు అందుకున్న భామ అయినా.. ఆడిషన్స్ కు అటెండ్ అయి మరీ ఓ హిందీ సినిమాలో అవకాశం సంపాదించుకుంది అమలా పాల్. అర్జున్ రాంపాల్ హీరోగా తెరకెక్కే సినిమాలో అమలా పాల్ కు అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది. నరేష్ మల్హోత్రా దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. ఎంటర్టెయినర్ జోనర్లో రూపొందే ఈ చిత్రం కోసం దక్షిణాది హీరోయిన్ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో.. రీసెంట్ గా ఆడిషన్స్ నిర్వహించారట.

వీటికి అటెండ్ అయిన అమలా పాల్.. తన నటనతో దర్శకుడిని మెప్పించిందని.. తన మైండ్ లో పాత్రకు ఆమే సరైన ఛాయిస్ అని ఫిక్స్ అయ్యాడట నరేష్ మల్హోత్రా. ఈ సినిమా కోసం కొంత మేకోవర్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పగా.. స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత.. ఇందుకు అమలాపాల్ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ అరంగేట్రంలోనే కొత్తగా కనిపించేందుకు అమలాపాల్ సిద్ధమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు