ఆ సీక్వెల్ లో నటించే ఉద్దేశ్యం లేదు

ఆ సీక్వెల్ లో నటించే ఉద్దేశ్యం లేదు

దండుపాళ్యం.. ఈ సినిమానే ఓ సంచలనం. హింసను ఈ స్థాయిలో స్క్రీన్ పై ఇప్పటివరకూ చూపించిన భారతీయ సినిమా మరొకటి లేదని అనిపిస్తుంది. హత్యలు.. మానభంగాలు.. కౄరత్వం.. వీటిని తెరకెక్కించిన విధానానికే సినిమాకు ఆదరణ దక్కింది. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్స్ కూడా వచ్చేశాయి. ఇప్పటివరకూ ఈ సిరీస్ లో 3 సినిమాలు రాగా.. అన్నిటీ ప్రేక్షకాదరణ లభించింది.

ఇప్పుడు దండుపాళ్యం చిత్రానికి 4వ సీక్వెల్ కూడా ఉంటుందని నిర్మాత వెంకట్ చెప్పాడు. 3వ పార్ట్ కూడా ఆశించిన మేరకు ఆడిందని.. అందుకే దండుపాళ్యం4 ను కూడా సిద్ధం చేస్తున్నామని.. తొలి మూడు భాగాల్లో నటించిన యాక్టర్స్ ను రిపీట్ చేయబోతున్నామంటూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇచ్చాడు వెంకట్. కానీ ఈ సీక్వెల్ లో నటించడంపై.. దండుపాళ్యం నటులంతా తమ వ్యతిరేకతను బాహాటంగానే చెప్పేశారు. ముఖ్యంగా సినిమాలో ప్రధానపాత్ర పోషించిన పూజా గాంధీ కూడా ఇదే మాట చెప్పింది.

'దండుపాళ్యం4లో నేను నటిస్తున్నానంటూ మీడియాలో వార్తలొచ్చాకే నాకు తెలిసింది. ఇప్పటివరకూ నన్నెవరూ అప్రోచ్ కాలేదు. నేను సైన్ చేయలేదు. నా ఫోటోను ఫస్ట్ లుక్ లో ఎలా ఉపయోగించుకున్నారో అర్ధం కావడం లేదు' అని చెప్పింది పూజా గాంధీ. రవి కాలే.. మకరంద్ దేష్ పాండే కూడా ఇదే విషయాన్ని చెబుతూ వీడియో బైట్స్ ఇవ్వడంతో ఈ అంశం వివాదంగా మారింది. మరి ఈ కాంట్రవర్సీపై వెంకట్ ఏం చెబుతాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు