అల్లుని చూస్తే అందరికీ కుళ్ళు!

అల్లుని చూస్తే అందరికీ కుళ్ళు!

ప్లానింగ్‌ విషయంలో, పర్‌ఫెక్షన్‌ విషయంలో అల్లు అర్జున్‌ తీసుకునే శ్రద్ధ ఈతరం హీరోల్లో ఎవరూ తీసుకోరంటే అది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ప్రతి సినిమా స్క్రిప్టు దగ్గర్నుంచి ఫస్ట్‌ కాపీ వరకు అల్లు అర్జున్‌ చాలా ఇన్‌వాల్వ్‌ అయి వీలయినంత బెస్ట్‌ అవుట్‌పుట్‌ తెచ్చుకోవాలని చూస్తాడు. ఏదైనా సినిమాలో సరుకు తక్కువైందని అనిపిస్తే తన డాన్సులు, ఫైట్ల మీద ఇంకాస్త శ్రద్ధ పెడతాడు. ఉదాహరణకి బద్రినాథ్‌, ఇద్దరమ్మాయిలతో, డిజె చిత్రాలనే చూడండి.

కథలో సరిపడా దమ్ము లేదన్నప్పుడు అల్లు అర్జున్‌ దానిని అంత తేలికగా వదిలి పెట్టడు. ఎలాగైనా పాస్‌ అయిపోయేలా చూస్తాడు. అందుకే వరుడు తప్ప అతని కెరియర్లో భారీ డిజాస్టర్‌ ఏదీ లేదు. పవన్‌, మహేష్‌, చరణ్‌... ఇలా అందరూ డిజాస్టర్లతో సఫర్‌ అవుతున్నా కానీ అల్లు అర్జున్‌ మాత్రం తన గ్రాఫ్‌ పడిపోకుండా చూసుకుంటున్నాడు. ఇందుకోసం అతను పడే శారీరిక శ్రమ, కేటాయించే సమయం కూడా కారణమే. 'నా పేరు సూర్య' చిత్రాన్నే తీసుకుంటే దీనికి వక్కంతం వంశీ దర్శకుడు. మామూలుగా ఎవరు చేసి వున్నా ఒక ఆర్మీ ఆఫీసర్‌ కథ అట అన్నట్టుండేది.

కానీ ఆ ఆర్మీ ఆఫీసర్‌ గెటప్‌ని ప్రత్యేక రీతిలో డిజైన్‌ చేయించుకున్న అల్లు అర్జున్‌ తన లుక్స్‌తో అదరగొట్టేస్తున్నాడు. ఒక్క పోస్టర్‌తోనే ఈ చిత్రంపై అంచనాలు రెండింతలు పెరిగాయంటే అతని ఇంపాక్ట్‌ ఎలాగుందో చూడండిక. ఈ పర్‌ఫెక్షన్‌, ఈ ప్లానింగ్‌ తమ హీరోలకి లేదే అంటూ ఇతర హీరోల అభిమానులు కుళ్లుకునేలా ప్రతి చిత్రంతోను ఏదో ఒక కొత్తదనం చూపిస్తూ తన ఫాలోయింగ్‌ పెంచుకుంటున్నాడు బన్నీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు