పవన్‌కళ్యాణ్‌ని ఎలాగైనా రప్పించాలని

పవన్‌కళ్యాణ్‌ని ఎలాగైనా రప్పించాలని

సాయి ధరమ్‌ తేజ్‌కి మెగా ఫ్యామిలీ నుంచి సహాయ సహకారాలు తగిన పాళ్లలో అందడం లేదని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. మిగిలిన మెగా హీరోలకి వున్నట్టు అతనికి ఫ్యామిలీనుంచి సలహాలిచ్చే పెద్ద వాళ్లు ఎవరూ లేకపోవడంతో నటుడిగా సాధించిన పేరుని చెత్త సినిమాలు చేసి పోగొట్టుకుంటున్నాడు. నిజానికి సాయి ధరమ్‌ తేజ్‌ని హీరో అవమని ఎంకరేజ్‌ చేసింది పవన్‌కళ్యాణ్‌ అట. అతని మాట మీదే రేయ్‌ చిత్రం తీసానని వైవిఎస్‌ చౌదరి చాలా సార్లు చెబుతుంటాడు.

ఆ చిత్రం ఆడియో వేడుకకి వచ్చి తేజ్‌ని ఆశీర్వదించిన పవన్‌ మళ్లీ అతడికి ఎప్పుడూ పబ్లిక్‌గా సపోర్ట్‌ ఇవ్వలేదు. చిరంజీవి వైపు నుంచి ఎందుకో తేజ్‌కి సరయిన సపోర్ట్‌ వుండదు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో అవుట్‌సైడర్‌ అనే ఫీలింగ్‌ ఏర్పడుతోంది. ఫాన్స్‌ నుంచి కూడా తేజ్‌కి కాస్త మద్దతు తగ్గుతోంది. చాలా మంది హీరోలు అయిపోవడంతో హిట్స్‌ ఇస్తున్న  వాళ్లనే గుర్తుంచుకునే పరిస్థితి. తన మలి చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పవన్‌ని భాగం చేసి తీరాలని తేజ్‌ ఇప్పట్నుంచే కృషి చేస్తున్నాడట. పవన్‌ రాజకీయాల్లో బిజీ అయినా కానీ తన చిత్రం ఆడియో వేడుకకి చిన్న మేనమామని రప్పించాలని చూస్తున్నాడట.

ఈ చిత్రానికి దర్శకుడు కరుణాకరన్‌ కావడంతో పవన్‌ని రప్పించడం ఈజీ అవుతుందని అనుకుంటున్నారు. తొలిప్రేమ, బాలు చిత్రాలు కరుణాకరన్‌తో చేసిన పవన్‌కళ్యాణ్‌కి అతడంటే ప్రత్యేక అభిమానం వుంది. మరి రాజకీయ పనులు కాసేపు పక్కనుంచి వీరి చిత్రానికి పవన్‌ టైమ్‌ కేటాయిస్తాడా అనేది చూడాలి. ఈ చిత్రం విడుదలకి సిద్ధమయ్యేది జూన్‌, జులైలో కనుక అప్పటికి పవన్‌ కాస్త తీరిక చేసుకోవచ్చునేమో మరి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English