సంక్రాంతి డ్యామేజ్‌.. దసరాకి రిపేర్‌!

సంక్రాంతి డ్యామేజ్‌.. దసరాకి రిపేర్‌!

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాపవడం మాటేమో గానీ త్రివిక్రమ్‌ పరువు నిలువునా తీసేసింది. ఫ్రెంచి సినిమా నుంచి కథని కాపీ కొట్టారనేది మొదలు తల తోక లేని సినిమా కోసం అన్ని కోట్లు తగలబెట్టాడంటూ అభిమానులు సైతం నిప్పులు కక్కారు. ఇంతవరకు ఇంత అగౌరవప్రదమైన పరాజయం చవిచూడని త్రివిక్రమ్‌ దీనినుంచి కోలుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు.

ఆడియన్స్‌ని టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసేసుకున్న త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రానికి ఆ తప్పు చేయకుండా కంటెంట్‌ని నమ్ముకుంటున్నాడు. ఎన్టీఆర్‌తో తీసే చిత్రం షూటింగ్‌ ఇంకా మొదలు కాలేదు కానీ దసరాకి మాత్రం రిలీజ్‌ చేస్తానని నిర్మాత రాధాకృష్ణకి మాట ఇచ్చేసాడు. దసరాకి సినిమా పక్కాగా రిలీజ్‌ అవుతుందంటూ బయ్యర్లతో థియేటర్ల పరంగా అగ్రిమెంట్లు కూడా చేసేసుకోమని చెప్పాడు.

బహుశా అజ్ఞాతవాసి పరాజయ భారం మోయలేకపోతున్నాడో లేక క్యాలెండర్‌ మారేలోగా తనని తిట్టిన నోళ్లతోనే శభాష్‌ అనిపించుకోవాలని అనుకుంటున్నాడో కానీ త్రివిక్రమ్‌ అయితే మహా కసి మీదున్నాడు. త్రివిక్రమ్‌ లాంటి జీనియస్‌కి ఈగో హర్ట్‌ అయి తన సత్తా చాటుకోవాల్సిన సమయం వచ్చినపుడు ఎన్టీఆర్‌ సినిమా రావడం నందమూరి అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ చిత్రంలో త్రివిక్రమ్‌ కలం శివతాండవం చేస్తుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు