ఎదురులేని బాహుబలి ఫైట్ మాస్టర్

ఎదురులేని బాహుబలి ఫైట్ మాస్టర్

సినిమా లో నెగ్గుకురావడానికి కావాల్సింది కేవలం కృషి, పట్టుదల, టాలెంట్ మాత్రమే కాదు చేసే పని పైన విపరీతమైన ఇష్టం, పని కోసం ఏమైనా చేయగల సత్తువ కూడా ఉండాలి. అవి ఇతనిలో మెండుగా ఉన్నాయి. ఆకాశం విరిగిపడినా, తానే సజీవ దహనం అయిపోతున్నా సరే పని మీద నుండి దృష్టి మరల్చడు. అతనే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్.

తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం.. ఏ బాషా అయినా సరే ఇతన్ని మించిన యాక్షన్ కొరియోగ్రాఫర్ లేనే లేదు. హాలీవుడ్ కి బాలీవుడ్ కి మధ్య తేడా బడ్జెట్ మాత్రమే కానీ ఇపుడు బాలీవుడ్ కూడా మెరుగుపడుతుంది అంటున్న పీటర్ బాహుబలి చేసేటప్పుడు 2000 మంది ఉండేవారని కాబట్టి యాక్షన్ అని చెప్పినా అందరికి వినపడదు కాబట్టి ఒక ఫ్లాగ్ ను ఊపేవాడినని.. అది ఒక నిజమైన యుద్ధం లా కనిపించేది అని అంటున్నాడు. చాలా వరకు అతను చేసే రీస్స్కీ షాట్స్ లో 50 లేదా 60 పర్సెంట్ మాత్రమే బతికి బట్టగలిగే ఛాన్స్ ఉంటుందని కానీ అతనికి పని అంటే పిచ్చి అని దానికోసం ఏదైనా చేసేంత పిచ్చితనం ఉందని చెప్తున్నాడు.

తనకు తగిలిన దెబ్బల గురించి చెప్తూ, ఒకసారి 60% స్కల్ విరిగిపోయిందట... మరోసారి అయితే 19 బోన్స్ విరగొట్టుకున్నాడు అంట. రెండుసార్లు వెన్నెముకని విరగొట్టుకున్న ఇతను ఒకసారి బట్టలు లేకుండా మంటల్లో దూకాడట. ఫైర్ కోసం స్పెషల్ ఎఫెక్ట్స్ చేసే టైం లేదని, కనీసం కూలింగ్ జెల్ కూడా అందుబాటులో లేకపోయేసరికి అలానే చేసేశానని ధైర్యంగా చెప్పేస్తున్నాడు. పీటర్ కు స్టెంట్స్ మీద ఉన్న ప్రేమ చూస్తే ఎవరైనా జోహార్ అనాల్సిందే కదూ.. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English