శ్రీదేవి కోసం హీరోయిన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్‌

శ్రీదేవి కోసం హీరోయిన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్‌

శ్రీదేవి మ‌ర‌ణం దేశ సినీ జ‌గ‌త్తుకు ఓ అంతులేని విషాదం. ఆదివారం అర్థ‌రాత్రికి ఆమె మ‌ర‌ణ వార్త బాలీవుడ్ జ‌నాల‌ను చేరింది. సామాన్య జ‌నాల‌కు చేర‌డానికి ఇంకా కొన్ని గంట‌లు స‌మ‌యం ప‌ట్టింది. మొద‌టిసారి  ఈ వార్త విన్న వారిలో చాలా మంది అంతా ఫేక్ అని కొట్టిప‌డేశారు. అలా కొట్టిప‌డేసిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఉంది. ఆమె కూడా శ్రీదేవి చ‌నిపోయిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లను న‌మ్మ‌లేక‌పోయింది. అందుకే ఓ అంత‌ర్జాతీయ ప‌త్రిక‌కు శ్రీదేవి గురించి త‌మ‌న మ‌నుసులోని అక్ష‌రాలుగా రాసింది.

శ్రీదేవి త‌న చిన్న‌నాటి రోల్ మోడ‌ల్ అని... ఆమెను చూసే తాను సినిమాల ఆస‌క్తిని పెంచుకున్నాన‌ని పీసీ ప‌త్రిక‌కు రాసిన లేఖ‌లో చెప్పింది. చిన్న‌పిల్ల‌లాంటి మ‌న‌స్త‌త్వ‌మున్న పాత్ర అయినా... పెద్ద‌రికం చూపించే క్యారెక్ట‌ర్ అయినా.. వినోదం... సీరియ‌స్‌... సెక్సీ... ఇలా ఏ పాత్ర అయినా.. చేయ‌డానికి శ్రీదేవే అంద‌రిక కంటే మిన్నఅని తెలిపింది. శ్రీదేవి చ‌నిపోయింద‌న్న వార్త తెలిసి... తాను కొద్ది నిమిషాలూ చ‌ల‌నం లేకుండా అయిపోయాన‌ని... తరువాత ఆమెతో క‌ల‌గ‌ల‌సిన జ్ఞాప‌కాల‌ను గుర్తు తెచ్చుకుంటూ కూర్చున్నాన‌ని చెప్పింది. శ్రీదేవి ఇంట‌ర్య్వూలు... వీడియో పాట‌లు చూస్తూ ఉండిపోయాన‌ని చెప్పింది.

శ్రీదేవిని చివ‌రి సారి క‌లుసుకున్న క్ష‌ణాలు కూడా క‌ళ్ల ముందు గిర్రున తిరిగిన‌ట్టు చెప్పింది. డిసెంబ‌ర్‌లో ఏదో ఒక ఈవెంట్ లో శ్రీదేవిని క‌లిశాన‌ని... త‌న‌ను చూడ‌గానే శ్రీదేవి ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు తీసుకుంద‌ని చెప్పింది. త‌న‌తో మాట్లాడుతూ జాన్వీ... ఖుషీల గురించి బోలెడు క‌బుర్లు చెప్పింద‌ని గుర్తు చేసుకుంది. శ్రీదేవిని పోయిన బాధ‌ని తానొక్క‌తే అనుభ‌వించ‌డం లేద‌ని... త‌న‌లాంటి ల‌క్ష‌ల మంది ప్రేక్షకులు అనుభ‌విస్తూ ఉంటార‌ని చెప్పింది. ఆమెతో... ఆమె సినిమాల‌తో పెన‌వేసుకున్న మ‌ధుర జ్ఞాప‌కాల‌ను త‌న లాంటి అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉంటార‌ని చెప్పింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు