మూడ్రోజుల నుండి సమంత ఏం చేస్తోందంటే

మూడ్రోజుల నుండి సమంత ఏం చేస్తోందంటే

టాలీవుడ్ బ్యూటీ సమంత.. మళ్లీ ఇప్పుడు చకా చక్ తన సినిమా పనులను పూర్తి చేసేస్తోంది. రామ్ చరణ్ రంగస్థలంకు తన వంతు షూట్ ఇప్పటికే పూర్తి చేసిన ఈ భామ.. ఇతర చిత్రాల పనుల్లో కూడా పడిపోయింది. కన్నడ మూవీ యూటర్న్ ను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నట్లు చెప్పిన ఈమె.. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది.

టాలీవుడ్ లో పెద్ద సినిమాల్లో ఈమెకు ఆఫర్స్ అందడం లేదు కానీ.. కోలీవుడ్ నుంచి మాత్రం ఈమెకు ఆదరణ బాగానే ఉంది. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న 12వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత.. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లోనే పాల్గొంటోంది. గత మూడు రోజులుగా ఓ పాట చిత్రీకరణ జరుగుతుండగా.. ఇందుకోసం కేరళ అందాల మధ్య చక్కర్లు కొడుతోంది సామ్. చాలకుడి వాటర్ ఫాల్స్ దగ్గర ప్రారంభమైన ఈ షూటింగ్.. అలెప్పీ వంటి కేరళ బ్యాక్ వాటర్స్ అందాలను కవర్ చేస్తూ సాగుతుంది.

ఈ లొకేషన్స్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసిన సామ్.. ఎంతటి అద్భుతమైన అందాల మధ్య  ఈ పాట సాగుతుందో చెప్పడం మానేసి చూపిస్తోంది. ప్రకృతి అందాలే ఇంతగా ఆకట్టుకుంటుంటే.. వాటి మధ్య సమంత లాంటి సొగసరి పాటేసుకుంటుంటే.. ఆ దృశ్యం మరీ అద్భుతంగా ఉంటుంది కదూ. ప్రస్తుతం అభిమానులు ఈ ఊహల్లోనే ఉన్నారు. మరో వారం పాటు ఈ సినిమా షూట్ లో పాల్గొననున్న సమంత.. ఆ తర్వాత రంగస్థలం ప్రమోషన్స్ లో జాయిన్ కానుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు