పిక్ టాక్: పెళ్లయినా రచ్చ తగ్గట్లేదు

పిక్ టాక్: పెళ్లయినా రచ్చ తగ్గట్లేదు

యోగా టీచర్ అవుదామని మొదలుపెట్టి.. సైకాలజీ చదివేసి.. స్నేహితులు చెప్పారని మోడలింగ్ లో ట్రై చేసి.. సూపర్ మోడల్ గా ఎదిగేసిన సుందరి లీసా హేడెన్. ఈ చెన్నై బ్యూటీ హైట్ ఎంతో తెలుసా. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉండే ఈ పొడగరి.. సినిమాలు తక్కువగా చేసినా గుర్తింపు మాత్రం విపరీతంగా తెచ్చుకుంది.

రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది లీసా. అలాగని తన అందాల డోస్ లో ఏమైనా తేడాలు వచ్చాయేమో అనుకోకండి. పెళ్లయిన ఏడాదికే పిల్లాడిని కూడా కనేసి.. మళ్లీ తన రూట్ లోకి తాను వచ్చేసింది. ఇప్పుడీ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పిక్స్ చూస్తే.. షాక్ తినాల్సిందే. పెళ్లయి పిల్లాడు పుట్టినా.. అందాల రచ్చ తగ్గించే ఉద్దేశ్యం ఏ మాత్రం లేదని చెప్పకుండానే చెబుతోంది టి లీసా హేడెన్. టూ పీస్ మైక్రో బికినీలో అమ్మడు ఇచ్చిన పోజులకు లైకులు కొట్టడం కూడా మర్చిపోవాల్సిందే.

ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఈ సుందరాంగి.. అక్కడి నుంచి తెగ షేరింగులు చేసేస్తోంది. బికినీ వేసుకుని ఒకే ప్లేస్ నుంచి మూడు నాలుగు పోజుల్లో ఫోటోలు దిగేసి.. అందాలను ఆరబోసేస్తూ అన్నిటినీ నెట్ లో పెడుతోంది లీసా హేడెన్. ఇంతటి అందగత్తెకు అప్పుడే పెళ్లి.. పిల్లాడు కూడానా అని అభిమానులు తెగ ఫీలయిపోతున్నారు. మరి ఈ అందాల రచ్చ బ్యూటీ.. మళ్లీ తన సోయగాలను ఆన్ స్క్రీన్ పైకి ఎప్పుడు తెస్తుందో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు