ప్రమోషన్స్ లేకుండా రిలీజేంటి బ్యూటి?

ప్రమోషన్స్ లేకుండా రిలీజేంటి బ్యూటి?

సినిమా ఎంత చెత్తగా ఉన్నా ఈ రోజుల్లో ప్రమోషన్స్ చేయాల్సిందే. అలాగే ఎంత బావున్నా కూడా ప్రమోషన్స్ తప్పదు. ఎందుకంటే బాలేదు అనుకున్న సినిమా ఓ వర్గానికి నచ్చవచ్చు. బావుంది అనుకున్న సినిమా అందరికి తెలిసిందంటే ఇంకా ఎక్కువ హిట్ అవ్వచ్చు. అందుకే ఈ రోజుల్లో ప్రమోషన్స్ కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. నిర్మాతలు బడ్జెట్ తో పాటు కొంత డబ్బును కూడా ప్రమోషన్స్ కోసం రెడీ చేసుకుంటున్నారు. బాలీవుడ్ ప్రచారాలు ఎక్కువగా ఉంటాయని అందరికి తెలిసిందే.

అయితే రీసెంట్ గా ఓ స్టార్ హీరోయిన్ మాత్రం పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా సినిమాను రిలీజ్ చేస్తోంది. ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ. అమ్మడు నిర్మించి నటించిన హారర్ మూవీ పారీ 2 ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెళ్లి తరువాత రిలీజ్ చేస్తోన్న మొదటి సినిమా ఇదే. టీజర్స్ తో మొన్నటి వరకు ఓ వర్గం ప్రేక్షకులకు మంచి థ్రిల్ల్ ఇచ్చింది ఈ సినిమా. అప్పుడే సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఎంతైనా కొంచెం ప్రమోషన్స్ చేయకుండా ఎవరు ఉండరు. అది కూడా సినిమాలో నటించినవారు నిర్మిస్తే ఆ డోస్ గట్టిగానే ఉంటుంది.

కానీ అనుష్క మాత్రం మీడియాతో తో కూడా ఎక్కువగా మాట్లాడడం లేదు. జస్ట్ సినిమా రిలీజ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టేసింది. సినిమా చూస్తే తప్పకుండా భయం కాయం అనేట్లుగా కూడా మెస్సేజ్ ఇచ్చింది. దీంతో సరికొత్త థ్రిల్ కోసం సినిమా చూడటానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అనుష్క ఇంతకుముందు తన ప్రొడక్షన్ లో నిర్మించిన రెండు సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. మరి ఈ హారర్ కాన్సెప్ట్ అయినా అమ్మడికి మంచి లాభాలను అందిస్తుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు