ఆచారికి ఖాళీ ఎక్కడుంది పాపం?

ఆచారికి ఖాళీ ఎక్కడుంది పాపం?

‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాను చక్కగా రిపబ్లిక్ డే వీకెండ్లో రిలీజ్ చేసేస్తే పోయేది. కానీ ఏం ఇబ్బందులొచ్చాయో ఏమో.. విడుదలకు మూడు రోజుల ముందు సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో బాక్సాఫీస్ డల్లుగా ఉన్నపుడు ‘భాగమతి’ వచ్చి వసూళ్ల పంట పండించుకుంది. అదే సమయంలో ‘ఆచారి అమెరికా యాత్ర’ వస్తే దానికీ మంచి ఫలితం దక్కేదేమో. ఆ వారాంతాన్ని వదిలేశాక తర్వాతి వారాల్లో సినిమాను రిలీజ్ చేయడానికి అవకాశం లేకపోయింది. తర్వాత అన్ సీజన్ మొదలైంది. ఇప్పుడు స్ట్రైక్ నడుస్తోంది.

మార్చి చివరి వారం నుంచి పెద్ద సినిమాల సందడి మొదలవుతోంది. రెండు నెలల దాకా అసలు ఖాళీ అన్నదే లేదు. ప్రతివారం క్రేజున్న సినిమాలు రిలీజవుతున్నాయి. దేనికి పోటీగా నిలిపినా ఇబ్బంది తప్పేట్లు లేదు. ఒక వారం వదిలేసినందుకు ఇంకో మూడు నెలలకు పైగా సినిమాను ఆపుకోవాల్సి వస్తోంది. జూన్ నెలలో కానీ ఈ సినిమాకు మోక్షం కలగకపోవచ్చేమో. ‘విక్రమార్కుడు’ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి చాలా ఏళ్ల విరామం తర్వాత నిర్మించిన సినిమా ఇది. దీనికి బడ్జెట్ అనుకున్న దాని కంటే కొంచెం ఎక్కువే అయింది. ఇప్పుడు నాలుగైదు నెలలు సినిమా ఆలస్యం కావడం వల్ల ఫైనాన్స్ వడ్డీలన్నీ లాస్. భారం మరింత పెరుగుతోంది. మరి ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో.. ఆయన పెట్టుబడి ఏమేరకు రికవర్ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు