ఆ ‘దండుపాళ్యం’లో మా ఫొటోలెలా వాడతారు?

ఆ ‘దండుపాళ్యం’లో మా ఫొటోలెలా వాడతారు?

దండుపాళ్యం.. కొన్నేళ్ల కిందట కన్నడనాట సంచలనం రేపిన సినిమా. కర్ణాకటలో సైకో ముఠా నిజ జీవిత గాథల్ని తెరమీద రియలిస్టిగ్గా చూపించి ప్రేక్షకుల్ని మెప్పించాడు తెలుగువాడైన శ్రీనివాసరాజు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. ఐతే దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘దండుపాళ్యం-2’ మాత్రం సరిగా ఆడలేదు. అయినా ‘దండుపాళ్యం-3’ రెడీ అయిపోయింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఐతే ఇదిలా ఉండగానే తెలుగులో వేరే చిత్ర బృందం ‘దండుపాళ్యం-4’ పేరుతో సినిమా అనౌన్స్ చేసింది. పోస్టర్లు వదిలారు. అందులో సగం మంది ‘దండుపాళ్యం’ రెగ్యులర్ నటీనటులు కనిపిస్తే.. సగం మంది కొత్తవాళ్లున్నారు.

ఐతే ఈ పోస్టర్లో కనిపించిన రెగ్యులర్ ‘దండుపాళ్యం’ నటీనటులు మీడియా ముందుకొచ్చారు. ఈ సినిమాలో తాము నటించట్లేదని.. తమ ఫొటోలు పోస్టర్ల మీద ఎలా వేసుకుంటారని ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా ఇలా ఫొటోలు వాడటం తప్పని.. ఈ సినిమాకు తమకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు స్పష్టం చేశారు. పూజా గాంధీ, రవి కాలె, మకరంద్ దేశ్ పాండే.. ఇలా ‘దండుపాళ్యం’ సిరీస్‌లో కీలకంగా ఉంటున్న నటీనటులు ‘దండుపాళ్యం-4’ విషయంలో అభ్యంతరాలు తెలిపారు. ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు.. కొత్త నిర్మాత కలిసి రూపొందిస్తున్నారు. అసలు ‘దండుపాళ్యం’ రెండో భాగం నుంచే అదరణ లేదంటే.. దీనికి నాలుగో భాగం తీయడమేంటో అర్థం కావడం లేదు. దీనికి తోడు ఈ గొడవలు కూడానా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు