రజినీ సినిమాకు అల్లుడి మ్యూజిక్

రజినీ సినిమాకు అల్లుడి మ్యూజిక్

‘2.0’.. ‘కాలా’ సినిమాలతోనే తన సినీ కెరీర్‌కు సూపర్ స్టార్ రజినీకాంత్ తెర దించేస్తాడని అందరూ అనుకున్నారు. ఐతే రజినీ మాత్రం ఇంకో సినిమా చేశాకే రాజకీయ రణరంగంలోకి దిగాలని డిసైడై అందరికీ షాకిచ్చాడు. ‘పిజ్జా’.. ‘జిగర్ తండ’.. ‘ఇరైవి’ లాంటి వైవిధ్యమైన సినిమాలతో తనదైన ముద్ర వేసిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ నిర్మించబోయే సినిమాలో రజినీ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కన్ఫమ్ అయ్యాడు. సన్ పిక్చర్స్ వాళ్లు అధికారికంగానే ఈ విషయాన్ని ప్రకటించారు.

‘3’ సినిమాలో ‘కొలవెరి’ పాటతో అరంగేట్రంలోనే అదరగొట్టేసిన అనిరుధ్.. గత కొన్నేళ్లలో చాలామంది స్టార్లతో సినిమాలు చేశాడు. రజినీ తర్వాతి స్థాయి స్టార్లు విజయ్, అజిత్ సినిమాలకు పని చేశాడు. ఇప్పుడు తమిళ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన రజినీ సినిమాకు పని చేయబోతున్నాడు. ఇది తన కల అని.. ఆ కల నెరవేరబోతుండటం చాలా ఉద్వేగంగా అనిపిస్తోందని అనిరుధ్ చెప్పాడు. విశేషం ఏంటంటే.. అనిరుధ్ రజినీకి అల్లుడి వరస అవుతాడు. రజినీ భార్య లతకు అనిరుధ్ మేనల్లుడు కావడం విశేషం. ఆమె తమ్ముడైన నటుడు రవిచందర్ కొడుకే అనిరుధ్. మరి తన మామ కోసం అనిరుధ్ ఎలాంటి ట్యూన్లు ఇస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు