మళ్లీ ఫ్లాప్ సినిమా చూసినట్టే ఉంది

మళ్లీ ఫ్లాప్ సినిమా చూసినట్టే ఉంది

నితిన్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమాపై ఆసక్తి బాగానే ఉంది. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నిర్మాతలుగా ఉండడంతో.. ఏదో కొత్తగా చూపించబోతున్నారనే అంచనాలు ఉన్నాయి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని.. లవ్ జోనర్ లో రూపొందిస్తున్నారు.

వేలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు మంచి స్పందనే వచ్చింది. కాకపోతే ఇందులో ఒక్క డైలాగ్ ను మాత్రమే వినిపించారు. ఇప్పుడు ప్రమోషన్స్ ను కంటిన్యూ చేస్తూ.. కొత్త పోస్టర్స్ ను విడుదల చేస్తున్నారు. వీటిలో నితిన్ - మేఘా ఆకాష్ లు ఇద్దరూ కనిపిస్తారు. కనెక్ట్ చేసిన రెండు రైలు బోగీలకు అటూ ఇటూ కూర్చుని ఒకరివంక ఒకరు చూసుకుంటూ కనిపిస్తారు. రెండు కంపార్ట్ మెంట్స్ కు రెండు రంగులతో చూసేందుకు ఈ విజువల్ బాగానే ఉంది. హీరో-హీరోయిన్లు కళ్లతోనే రొమాన్స్ పలికించేశారనే సంగతి అర్ధమవుతోంది.

కానీ నితిన్ గత చిత్రం లై లో కూడా ఇలాగే ట్రైన్ దగ్గర ఓ సీన్ ఉంటుంది. అందులో కూడా నితిన్- మేఘా ఆకాష్ లే జంటగా నటించారు. దీంతో ఇప్పుడు ఛల్ మోహన్ రంగా పోస్టర్ చూస్తున్నా.. లై మూవీలో సీన్ మాదిరిగానే అనిపిస్తోంది తప్ప.. ఏదో కొత్త సినిమా పోస్టర్ చూస్తున్న ఫీలింగ్ రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అన్నీ కొత్తగా ఎక్స్ పెక్ట్ చేసేయడం అత్యాశే అయినా.. ప్రమోషన్ పోస్టర్స్ లో ఇలాంటి పోలికలు కనిపించకుండా చూడడం బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English