నో ధియేటర్స్.. కాని అందరూ హ్యాపీస్

నో ధియేటర్స్.. కాని అందరూ హ్యాపీస్

అప్పట్లో భారత్ బంద్ లు.. రాష్ట్ర బంద్ లు లాంటివి జరిగినపుడు హోల్ సేల్ గా థియేటర్లన్నీ మూతబడేవి. అయినా సరే చాలావరకూ థియేటర్లలో ఈవెనింగ్ షోస్ వరకూ పడేవి. కానీ ఎన్నడూ చూడని విధంగా.. ఏకంగా నిరవధికంగా థియేటర్లను బంద్ చేసేస్తున్నారు. అది కూడా రేపటి నుంచే జరుగుతోంది.

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా సినిమా ప్రదర్శనలు ఉండవు. ఇండస్ట్రీ సమస్యలు ఓ కొలిక్కి రాకపోవడమే ఇందుకు కారణం. అయితే.. ఇలా సినిమా థియేటర్లు మూతబడే పరిస్థితి వచ్చినా.. దాని గురించి ఎక్కువగా డిస్కషన్స్ జనాల్లో జరగడం లేదు. ఇందుకు కారణం.. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్. సినిమా ధియేటర్లకు జనాలు వెళ్లేదే ఎంటర్టెయిన్మెంట్ కోసం. సినిమాలు లేనంత మాత్రాన.. ఎంటర్టెయిన్మెంట్ కేమీ ఢోకా లేదు. టీవీల్లోను.. ఇంటర్నెట్ లోను కావాల్సినంత వినోదం లభిస్తోంది.

అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. సన్ నెక్ట్స్ లాంటివి వచ్చాక అన్నీ ఇంటిదగ్గరే హై క్వాలిటీతో చూసే అవకాశం లభిస్తోంది. అందుకే జనాలు ఈ బంద్ గురించి పట్టించుకోవడం లేదు. మరోవైపు సినిమాలకు మహారాజ పోషకులు అంటే కుర్రకారు.. ఆ తర్వాత ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ మార్చ్ వచ్చిందంటే ఎగ్జామ్స్ సీజన్ బిగిన్ అయిపోతుంది. స్టూడెంట్స్ అంతా చదువుల్లో పడిపోయారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ నెల చివరి వరకూ సినిమాలకు దూరంగానే ఉంటారు. వారి వారి పిల్లలను చదివించుకోవడం.. పరీక్షలకు సన్నద్ధులు చేయడంతోనే వారికి సరిపోతుంది.

ఇక థియేటర్ల వారికి కూడా ఈ బంద్ కారణంగా పెద్దగా నష్టాలు రాకపోవచ్చు. ఎందుకంటే ఎలాగూ కొత్తగా పెద్ద సినిమాలేమీ వచ్చేయవు. వచ్చినవాటితో థియేటర్ల బాక్సులు బద్దలైపోయే కలెక్షన్స్ కూడా రావు. అందుకే వీరు కూడా ఇప్పుడు బంద్ గురించి పెద్దగా బెంగ పెట్టుకోవడం లేదు. మొత్తానికి థియేటర్లన్నీ మూతపడుతున్నా ఆల్ హ్యాపీస్ అన్నట్లుగానే ఉంది సిట్యుయేషన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English