తల అజిత్.. ఇన్నాళ్లకు మారాడు

తల అజిత్.. ఇన్నాళ్లకు మారాడు

తన ఫాలోయింగ్‌ను అజిత్ సరిగ్గా ఉపయోగించుకోడనే పేరుంది. ఎప్పుడూ మూస సినిమాలు చేయడం వల్ల కేవలం మాస్ ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు మాత్రమే చేరువగా ఉంటున్నాడు అజిత్. అతడి స్థాయి హీరో భిన్నమైన సినిమాలు చేస్తే వాటి రేంజే వేరుగా ఉంటుందన్నది విశ్లేషకుల మాట.

కొన్నేళ్లుగా తనకు ‘వీరం’ రూపంలో మంచి హిట్టిచ్చిన శివను పట్టుకుని వేలాడుతున్నాడు అజిత్. ఐదేళ్ల వ్యవధిలో అతడితో నాలుగో సినిమా చేశాడు. ‘వివేగం’ ఫ్లాప్ అయ్యాక కూడా అతడితోనే మళ్లీ ‘విశ్వాసం’ అనే సినిమా చేస్తున్నాడు అజిత్. ఈ నిర్ణయం చాలామందికి రుచించలేదు. ఐతే ఈ సినిమా తర్వాత మాత్రం అజిత్ కొంచెం రూటు మార్చబోతున్నాడు. ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు.

‘శతురంగ వేట్టై’ లాంటి సెన్సేషనల్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా పరిచయమై.. కొన్ని నెలల కిందట ‘ఖాకీ’ సినిమాతో మరోసారి మెప్పించిన హెచ్.వినోద్ దర్శకత్వంలో అజిత్ నటించబోతున్నాడు. తన గత రెండు సినిమాల తరహాలోనే భిన్నమైన కథతో ఈ సినిమా చేయనున్నాడట వినోద్. ఐతే అజిత్ మాస్ ఇమేజ్‌ను కూడా విడిచిపెట్టకుండా బ్యాలెన్స్డ్‌గా ఈ సినిమా తీయాలని చూస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్దంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు