దేవిశ్రీ దంచినట్లున్నాడుగా...

దేవిశ్రీ దంచినట్లున్నాడుగా...

‘రంగస్థలం’ సినిమా దేవిశ్రీ ప్రసాద్‌కు ఎంతో కీలకం. గత ఏడాది కొన్ని సినిమాల ఆడియోలు దేవికి చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. దేవి మరీ రొటీన్‌గా వాయించేస్తున్నాడని.. అతడి ప్రత్యేకత ఏమీ కనిపించట్లేదని.. ఫాం కోల్పోయాడని విమర్శలు వచ్చాయి.

దీంతో ఈ ఏడాది తన నుంచి రాబోతున్న తొలి సినిమా ‘రంగస్థలం’తో తనేంటో అందరికీ రుజువు చేయాలని పట్టుదలతో ఉన్నాడు దేవి. మిగతా దర్శకుల సంగతేమో కానీ.. సుకుమార్‌తో సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ రెట్టింపవుతుంది. ఆడియో అదిరిపోతుంటుంది. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన గత సినిమాలే అందుకు రుజువు. ఇప్పుడు ‘రంగస్థలం’ విషయంలో దేవి మరింత శ్రద్ధ పెట్టి పని చేసినట్లే కనిపిస్తోంది.

ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజైన ‘ఎంత సక్కగున్నావే..’ పాట సూపర్ హిట్టయింది. యూట్యూబ్‌లో లిరికల్ సాంగ్‌ అత్యంత వేగంగా కోటి వ్యూస్ తెచ్చుకున్నది ఈ పాటతోనే. అంతే కాదు.. ఒక లిరికల్ సాంగ్‌కు అత్యధిక లైక్స్ రికార్డు కూడా దీనిదే. దీని తర్వాత దేవిశ్రీ పూర్తి భిన్నమైన పాటను అందించబోతున్నాడు. రంగా రంగస్థలాన అంటూ సాగే టైటిల్ సాంగ్ రేపు లాంచ్ కాబోతోంది.

 ఇది ఆంద్రా పల్లెల్లో ఫేమస్ అయిన జానపదాల స్టయిల్లో ఉంటుందట. ఇందుకోసం గ్రామీణ జానపద కళాకారుల సాయం తీసుకున్నాడు దేవి. వాళ్లతో ఒక టీజర్ కూడా కట్ చేశాడు. అది భలే ఎనర్జిటిగ్గా ఉంది. ఈ పాట పల్లవి కూడా మాంచి ఊపు తెస్తోంది. ఇది కూడా ‘ఎంత సక్కగున్నావే’ తరహాలోనే ఇన్‌స్టంట్ హిట్టయ్యేలాకనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు