‘బిగ్ బాస్’ కుర్రాడు ఇలా అయ్యాడేంటి?

‘బిగ్ బాస్’ కుర్రాడు ఇలా అయ్యాడేంటి?

తేజ దర్శకత్వంలో రూపొందిన ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యువ కథానాయకుడు ప్రిన్స్. ఆ సినిమా అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత ‘బస్ స్టాప్’.. ‘రొమాన్స్’తో పాటు మరి కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ హీరోగా పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు. చివరికి ‘నేను శైలజ’.. ‘మిస్టర్’ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌కు మారిపోయాడు.

ఆ సినిమాలు అతడికి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఒక దశలో ప్రిన్స్ కెరీర్ దాదాపుగా ముగిసిపోయింది అనుకున్న సమయంలో ‘బిగ్ బాస్’ షో అతడికి మళ్లీ లైఫ్ ఇచ్చింది.

‘బిగ్ బాస్’ షోలో టైటిల్ కన్సిస్టెంట్లలో ఒకడిగా ఉన్న ప్రిన్స్.. చివరి దశలో నిష్క్రమించాడు. ఈ షోతో జనాలకు బాగానే చేరువయ్యాడు ప్రిన్స్. ఈ గుర్తింపుతో మళ్లీ సినిమాల్లో వెలిగిపోవాలని చూస్తున్న ప్రిన్స్.. కొన్ని నెలల పాటు కష్టపడి తన అవతారం మార్చుకోవడం విశేషం. ప్రస్తుతం అతడి లుక్ చూస్తే షాకవ్వాల్సిందే. చాలా సాఫ్ట్‌గా, బబ్లీగా కనిపించే ప్రిన్స్.. బాలీవుడ్ హీరోల్లాగా చిజిల్ బాడీతో అందరికీ షాకిచ్చాడు. జుట్టు, గడ్డం కూడా బాగా పెంచిన ప్రిన్స్‌ను ఈ అవతారంలో సడెన్‌గా చూస్తే గుర్తు పట్టడం కష్టమేమో. అంతగా మేకోవర్ జరిగింది. మరి ఈ మేకోవర్ ఏ సినిమా కోసమో ఏంటో? బహుశా అతను ఏదైనా యాక్షన్ సినిమాకు రెడీ అవుతుండొచ్చు. ఆ వివరాలు త్వరలోనే బయటికి వస్తాయని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు