ఆయ‌న వ‌ల్లే రంగ‌స్థ‌లం లేటైయిందా?

ఆయ‌న వ‌ల్లే రంగ‌స్థ‌లం లేటైయిందా?

ప్ర‌కాష్ రాజు ఓ గొప్ప న‌టుడు. తండ్రి పాత్ర‌యినా... అన్న పాత్ర‌యినా... విల‌న్ పాత్ర అయినా... చాలా ఈజీగా చేసిప‌డేస్తాడు. అందుకే ఒక‌ప్పుడు ఆయ‌న టాప్ హీరోల స్థాయిలో బిజీగా ఉండేవాడు. ఏడాది మొత్తం షూటింగ్‌లే ఉండేవి. కానీ కొన్ని రోజులుగా ప‌రిస్థితి అలా లేదు. కొన్ని సినిమాల్లోనే చాలా రేర్‌గా ప్ర‌కాష్ రాజు క‌నిపిస్తున్నాడు. మంచి న‌టుడికి సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డ‌మేంటీ?  దానికి అత‌ని ప్ర‌వ‌ర్త‌నే కార‌ణ‌మ‌ని స‌మాచారం.

ప్ర‌కాష్ రాజ్ షూటింగ్‌ల‌కు చాలా ఆల‌స్యంగా వ‌స్తాడ‌ట‌. చిన్న‌పిల్ల‌లు స్కూల్‌కి డుమ్మాలు కొట్టిన‌ట్టు... స‌డెన్ షూటింగ్‌కి రాడ‌ట‌. సారీ అని ద‌ర్శ‌కుడిని ఫోన్ చేసి చెబుతాడంట‌. దీనివ‌ల్లే ద‌ర్శ‌కులెవ‌రూ అత‌డికి సినిమా ఆఫ‌ర్లు ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని స‌మాచారం. ముఖ్యంగా రంగ‌స్థ‌లం విడుద‌ల తేదీ మార‌డానికి కూడా ప్ర‌కాష్ రాజే కార‌ణ‌మ‌ని గుస‌గుస‌లాడుతున్నారు ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు. ప్ర‌కాష్ రాజ్ మీద ఆది పినిశెట్టి మీద చిత్రీక‌రించాల్సిన సీన్లు ఉన్నాయ‌ని... అవి తీయ‌డానికి చాలా ఆల‌స్య‌మైంద‌ని అంటున్నారు. సుకుమార్ ఫిబ్ర‌వ‌రి 28న ఆ సీన్ల‌కు సంబంధించి షూటింగ్ పెట్టుకున్నాడ‌ట‌. ఆది పినిశెట్టి వైజాగ్ షూటింగ్‌లో ఉండ‌గా బ‌తిమిలాడి హైద‌రాబాద్ ర‌ప్పించాడ‌ట‌... కానీ అదేరోజు చెప్పాపెట్ట‌కుండా ప్ర‌కాష్ రాజ్ డుమ్మాకొట్టాడ‌ట‌. దీంతో ఆది పినిశెట్టి మ‌ళ్లీ వైజాగ్ వెళ్లిపోయాడ‌ట‌. దీంతో ఆ సీన్లు బాకీ ప‌డ్డాయ‌ని స‌మాచారం.

ప్ర‌కాష్ రాజ్ చాలా సీనియ‌ర్ న‌టుడు. అలాంటి న‌టుడు ఇలా చేస్తాడంటే న‌మ్మ‌డానికి కాస్త క‌ష్ట‌మే. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌తో దిల్ రాజు, త్రివిక్ర‌మ్ శ్రీన‌వాస్‌లాంటి వాళ్లు విసిగిపోయార‌ట‌. అందుకే అత‌నికి బ‌దులు... టైమ్‌కి షూటింగ్‌కు వ‌చ్చే ఇత‌ర క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌ను తీసుకుంటున్నార‌ట‌. ప్ర‌కాష్ రాజ్ చెవిలో ఈ విష‌యాలు ప‌డ్డాయో లేదో మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు