చెర్రీ బాలీవుడ్ విలన్.. అంత క్రూరుడా?

చెర్రీ బాలీవుడ్ విలన్.. అంత క్రూరుడా?

హీరో ఎంత శక్తివంతుడో తెలియాలంటే.. విలన్ అంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఇవాల్టి సినిమాల్లో విలన్ పాత్రను ఇంత శక్తివంతంగా చూపించడం తగ్గిపోతోంది. హీరో ఓ చెయ్యి విదిలిస్తే.. విలన్స్ 3-4 పల్టీలు కొట్టి ఓ పాతిక మీటర్ల దూరంలో పడుతున్నారు. ఇలాంటి టైంలో కూడా ప్రతి నాయకుడి పాత్రను పవర్ ఫుల్ గా ఉండేలా ఓ సినిమా ఉండడం అంటే విశేషంగానే చెప్పాలి.

ఇప్పుడు రామ్ చరణ్ తన సినిమాలో విలన్ కు ఇంతటి పవర్స్ ఇచ్చేస్తున్నాడట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ హీరోగా కొత్త సినిమా మొదలైంది. చరణ్ ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు కానీ.. కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగిపోతోంది. రీసెంట్ గా విలన్ ఇంట్రడక్షన్ సీన్స్ కూడా రూపొందించేశారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్.. ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రక్తచరిత్రలో కనిపించినా.. ఫుల్ లెంగ్త్ స్ట్రెయిట్ ఫిలిం ఇదే. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ పాత్ర చాలా క్రూరంగా ఉంటుందట.

ఎంత క్రూరమైన పాత్ర అంటే.. జస్ట్ ఇంట్రడక్షన్ సీన్ కోసమే.. 25-30 మందిని కార్లు తొక్కించుకుంటూ వెళ్లిపోతే.. ఆ కార్ల కారణంగా ఏర్పడిన దుమ్ము మధ్య నుంచి వివేక్ ఒబెరాయ్ కనిపించే సీన్ ఇది. తెలుగు సినిమాల్లో విలన్ కి ఇంతటి భారీ ఇంట్రడక్షన్ సీన్ ఇప్పటివరకూ ఉండకపోవచ్చని అంటున్నారంటే.. వివేక్ ఒబెరాయ్ కి ఏ రేంజ్ సీన్ ఈ సినిమాలో ఉండబోతోందో అర్ధమవుతుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు